ETV Bharat / entertainment

రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర దొరికినా సంతోషమే: నటుడు ఆర్య

తమిళ నటుడు ఆర్య.. 'వరుడు'లో విలన్​గా కనిపించినప్పటికి 'నేనే అంబానీ', 'రాజా రాణి' లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. త్వరలో 'కెప్టెన్'​ అనే కొత్త ప్రాజెక్ట్​తో ధియేటర్లలోకి రానున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మరిన్ని ముచ్చట్లు ఆయన మాటల్లోనే...

Etv BharHero Arya On His Upcoming Movieat
Etv BharatHero Arya On His Upcoming Movie
author img

By

Published : Sep 7, 2022, 6:42 AM IST

Hero Arya On His Upcoming Movie : నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన కొద్దిమంది తమిళ నటుల్లో ఆర్య ఒకరు. 'వరుడు'లో ప్రతినాయకుడి పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన ఈ నటుడు 'వాడు వీడు', 'నేనే అంబానీ', 'రాజారాణి' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. గతేడాది విడుదలైన 'సార్‌పట్ట' చిత్రాలతో ఘన విజయం అందుకున్న ఆర్య ఈ ఏడాది 'కెప్టెన్‌' చిత్రంతో తెలుగు అభిమానుల ముందుకి రానున్నారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ హంగులతో రూపొందించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సందర్భంగా కెప్టెన్‌ సినిమా విశేషాలు నటుడు ఆర్య మాటల్లోనే..

అసలు కెప్టెన్‌ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది?
ఆర్య: డైరెక్టర్‌ శక్తి సౌందరరాజన్‌ నాకు 'టెడ్డీ'తో పరిచయం. గతంలో 'టిక్‌..టిక్‌..టిక్‌..' లాంటి సైన్స్‌ ఫిక్షన్‌ని కూడా తీశారు. వేరే డైరెక్టర్‌ ఎవరైనా ఈ స్టోరీ చెప్పుంటే నేను ఆలోచించేవాడినేమో! ఆయనకి ఆ సత్తా ఉందని నమ్మి కెప్టెన్ కి ఒకే చెప్పాను.

ట్రైలర్‌లో కనిపించే జంతువే ఈ సినిమాకి ప్రధానాంశమా? ఇంకేమైనా ఉందా?
ఆర్య: కెప్టెన్‌లో నేను ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో నటించా. మా పోరాటం ప్రపంచానికి సంబంధం లేని కొత్త రకం జంతువులపై. ఈ సినిమాలో యాక్షన్‌, ఎమోషన్‌, థ్రిల్లింగ్‌ అంశాలన్నీ ఉంటాయి. ఈ సినిమా కోసం సృష్టించిన జంతువులు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి.

ప్రతి సినిమాలోలాగే ఈ సినిమాలో ఛాలెంజింగ్‌గా ఏమైనా చేశారా?
ఆర్య: ఈ సినిమా పూర్తిగా సైన్స్‌ఫిక్షన్‌. ఇందులో ప్రతి సన్నివేశాన్ని సాంకేతిక సిబ్బంది కష్టపడి రూపొందించారు. నటులు సైతం చాలా కష్టపడ్డారు. కెప్టెన్‌ క్లైమాక్స్‌ను చిత్రీకరించడానికి దాదాపు 100అడుగుల దిగువన, నీటిలో 20 అడుగుల లోతులో ఆక్సిజన్‌ సిలిండర్లు మోసుకుంటూ, స్కూబా డైవింగ్‌ కాస్ట్యూమ్‌తో మూడు రోజులు కష్టపడ్డాం.

'కెప్టెన్‌'కు మీరు సహనిర్మాతగానూ వ్యవహరించారు. ఈ సినిమా బడ్జెట్‌ ఏంత?
ఆర్య: అవును.. నేను సహ నిర్మాతను. కానీ, బడ్జెట్‌ ఎంతయ్యిందనేది మేము చూసుకోలేదు. ప్రతి సన్నివేశాన్ని అనుకున్న విధంగా పూర్తి చేశాం. గ్రాఫిక్స్‌ హంగులకే బడ్జెట్‌ ఎక్కువయ్యింది.

ఈ సినిమాలో సిమ్రన్‌ నటించారు..ఆమె పాత్ర ఎలా ఉంటుంది?
ఆర్య: ఆమె పాత్ర చాలా కీలకం. ఒకవేళ ఆమె ఆ పాత్రకు నో చెప్పుంటే మాకు వేరే ఆప్షన్‌ లేదు. కానీ ఆమె ఒప్పుకోవడం మాకు ప్లస్‌ అయ్యింది. సినిమాకు బలమైంది.

Hero Arya On His Upcoming Movie
కెప్టన్​ పోస్టర్​

ఈ తరహా ప్రయత్నం, కొత్త జోనర్‌లో ప్రయోగం చేయడానికి కారణమేంటి?
ఆర్య: నిజానికి నా దగ్గరికి వచ్చే స్టోరీలు అలానే ఉంటాయి. ఇంకా దర్శకుడు శక్తి సౌందరరాజన్‌కు ఇటువంటి ప్రయోగాలు చేయడం అలవాటు. అందుకే మేమంతా కలిశాం.

ప్రస్తుతం పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది.. కెప్టెన్‌ను ఎందుకు రెండు భాషల్లోనే(తెలుగు, తమిళం) విడుదల చేస్తున్నారు?
ఆర్య: నిజమే నేనిప్పటివరకూ పాన్‌ ఇండియా సినిమాలో నటించలేదు. అయితే మొదట రెండు భాషల్లో విడుదల చేసి ప్రేక్షకుల స్పందన బట్టి ఇతర భాషల్లోనూ విడుదల చేసే ఆలోచన ఉంది.

శ్రేష్ఠ్‌ ఫిల్మ్స్‌ ద్వారా మీ సినిమాను విడుదల చేస్తున్నారు..ఎలా అనిపించింది?
ఆర్య: నితిన్‌ నాకు మంచి ఫ్రెండ్‌. శ్రేష్ఠ్‌ ఫిల్మ్స్‌ ప్రతిష్ఠాత్మకమైన బ్యానర్‌. ఈ ఏడాదిలో విక్రమ్‌ తో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా మంచి ఫలితాన్నే ఇస్తుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమాకు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఆర్య: ఈ సినిమాలో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటించా. యూనీఫామ్‌ మొదలుకుని, గన్స్‌, షోల్డర్‌ స్టార్స్‌, కాస్ట్యూమ్ కలర్స్‌ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సహాయం తీసుకుని రూపొందించాం. ఇండియన్‌ ఆర్మీ యూనిఫామ్‌ కుట్టినచోటే ఈ సినిమా కాస్ట్యూమ్స్‌ కుట్టించాం. వాహనాల నంబర్ల విషయంలో సైతం జాగ్రత్తలు తీసుకున్నాం.

సాధారణంగా ఇటువంటి సినిమాలకు సీక్వెల్‌ ఉంటుంది కదా?మీరేమైనా ప్లాన్‌ చేస్తున్నారా?
ఆర్య: లేదు. సినిమా చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది. ఫుల్‌ క్లారిటీతో సినిమాను ఎండ్‌ చేశాం.

ప్రస్తుతం ఓటీటీల రాకతో థియేటర్లకు కాలం చెల్లిపోయిందన్న వాదనను సమర్థిస్తారా?
ఆర్య: అదేం ఉండదండి. కాకపోతే ఇంతకుముందులా కాకుండా సినిమాలోని కంటెంట్‌ను బట్టి ప్రేక్షకులు థియేటర్‌కు వస్తున్నారు. నిజానికి ఓటీటీలు సినిమాలను ప్రేక్షకులకుదగ్గర చేశాయి.

మీరు నేరుగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
ఆర్య: ఇలా బాగానే ఉంది కదండీ(నవ్వుతూ...) నేను తెలుగులో సినిమా తీసి తమిళంలో డబ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.

Hero Arya On His Upcoming Movie
హీరో ఆర్య

తెలుగులో మీ అభిమాన దర్శకుడు ఎవరు?డ్రీమ్‌ రోల్ ఏమైనా ఉందా?
ఆర్య: డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏం లేదు. నా దగ్గరకు వచ్చిన రోల్‌లో నటించడానికి ప్రయత్నిస్తా. ఇక తెలుగులో అభిమాన దర్శకుడు అంటే కచ్చితంగా రాజమౌళి సార్‌. ఆయన దర్శకత్వంలో చిన్న పాత్ర పోషించిన చాలు.

మీ రానున్న చిత్రాల సంగతేంటి?వెబ్‌సిరీస్‌లో ఏమైనా నటిస్తున్నారా?
ఆర్య: ముత్తయ్య అనే రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలో నటిస్తున్నాను. ఇంకా కొన్ని కథలు విన్నాను. ఫైనల్‌ చేయాలి. విలేజ్‌ అనే హారర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నా. అందులో సిద్ధార్థ్‌ కూడా ఉన్నాడు. వచ్చే సంవత్సరం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతుంది..

ఇదీ చదవండి: ప్రభాస్​ సినిమా థియేట్రికల్‌ రైట్స్‌కు అంత ధరా!

ఎన్టీఆర్​ శ్రీకృష్ణుడి గెటప్​.. ఒకే ఫ్రేమ్​లో నలుగురు కమల్​ హాసన్స్​.. వెనక పెద్ద కథే ఉందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.