ETV Bharat / entertainment

అల్లరి నరేశ్‌ 'ఉగ్ర' రూపం.. అసలు ఆయనేనా అలా చేసింది? - అల్లరినరేశ్​ ఉగ్రం మూవీ డైరెక్టర్​

అల్లరి నరేశ్​ హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం 'ఉగ్రం'. 'నాంది' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్​లో వస్తున్న రెండో చిత్రమిది. తాజాగా ఈ టీజర్​ విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది.

Allari Naresh
అల్లరి నరేశ్‌ 'ఉగ్ర' రూపం.. అసలు ఆయనేనా అలా చేసింది?
author img

By

Published : Feb 22, 2023, 3:15 PM IST

Updated : Feb 22, 2023, 3:34 PM IST

అల్లరోడిగా సిల్వర్​స్క్రీన్​పై కడుపుబ్బా నవ్వులు పూయించిన అల్లరి నరేశ్​.. ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. కథా బలం, నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గమ్యం, మహర్షి, నాంది వంటి చిత్రాలతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. అయితే ఆ మధ్యలో చాలా ఏళ్ల పాటు వరుస ఫ్లాప్​లతో సతమతమైన ఆయన రీసెంట్​గా 'నాంది' చిత్రంతో హిట్‌ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇటీవల ఆయన నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రంలో కూడా అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు దక్కాయి.

అయితే ఇప్పుడాయన నటిస్తున్న కొత్త చిత్రం 'ఉగ్రం'. విజయ్‌ కనకమేడల తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'నాంది' వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. దీంతో ఈ సినిమాపై ఆడియెన్స్​లో మంచి అంచనాలే నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్​ విడుదలైంది. ఇందులో ఆయన ఇంటెన్స్​గా ఉన్న యాక్షన్ రోల్‌ చేశారు. ఓ కొత్త అవతార్​లో కనిపించారు. పోలీస్ ఆఫీసర్‌గా​ తన ఉగ్రరూపాన్ని చూపించారు. పోలీస్ ఆఫీసర్​గా నరేశ్​ విలన్లను ఎదురించడం.. విలన్లు హీరోను చంపేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలోనే ప్రతినాయకుడు.. హీరో ఫ్యామిలీని టచ్ చేయడం.. ఆ తర్వాత హీరో మళ్లీ పగ తీర్చుకోవడం.. అలా టీజర్​ మొత్తం ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ కనిపించింది. ఈ టీజర్​లో​ 'నాది కాని రోజు కూడా ఇలానే నిలబడతా' అంటూ నరేశ్​ సీరియస్​గా​ చెప్పే డైలాగ్​ కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ ప్రచార చిత్రం​ చివర్లో ఆయన ఎంతో కోపంతో ఓ బూతు మాట కూడా మాట్లాడారు. ఏదేమైనప్పటికీ అసలు కథను చెప్పకుండా దర్శకుడు ఈ టీజర్‌ కట్ చేసినట్లు అనిపిస్తోంది. మొత్తంగా ఈ ప్రచార చిత్రం చూస్తుంటే ఓ పక్కా రివెంజ్ యాక్షన్​ డ్రామాలా కనిపిస్తోంది.

ఇకపోతే ఈ చిత్రంలో మిర్నా మేనన్‌ కథానాయిక. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్​ 14న రిలీజ్​ చేస్తామని అంతకుముందు అనౌన్స్​ చేశారు. అయితే ఇది వాయిదా పడిందని, మే 5న రిలీజ్​ అయ్యే అవకాశం ఉందని కూడా ప్రచారం సాగుతోంది. ఏదేమైనప్పటికీ ఇంకా కచ్చితమైన రిలీజ్​ డేట్​ రాలేదు. అంతవరకు ఈ ఆసక్తికరమైన ఈ టీజర్‌ మీరూ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: టాలీవుడ్​లోకి మరో కన్నడ భామ.. క్యూట్​ + హాట్​నెస్​ ఓవర్​లోడెడ్​!

Last Updated : Feb 22, 2023, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.