ETV Bharat / entertainment

హీరోయిన్లలో ఫస్ట్​ టైమ్​ రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకుందెవరో తెలుసా? - శ్రీదేవి కోటి రూపాయల బిల్లు

Herione One Crore Rupees Remuneration : సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా.. హీరో కన్నా హీరోయిన్​ రిమ్యునరేషన్​ కాస్త తక్కువగానే ఉంటుంది. అయితే మన దేశంలో హీరోయిన్లలో తొలిసారిగా రూ.కోటి రెమ్యునరేషన్ తీసుకుందెవరో తెలుసా?

herione one crore rupees remuneration
herione one crore rupees remuneration
author img

By

Published : Jun 9, 2023, 7:57 PM IST

Herione One Crore Rupees Remuneration : మన దేశంలో బాలీవుడ్ టు మాలీవుడ్.. అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్ల జాబితాలో రేఖ, మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి తారలు చాలా మందే ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే అది పెద్ద జాబితానే. కానీ తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ మాత్రం వీళ్లలో ఎవ్వరూ కారు.

వారంతా అంతా ఒకానొక దశలో అత్యధిక పారితోషికం అందుకున్న వాళ్లే కానీ.. ఓ నివేదిక ప్రకారం తొలిసారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్ మాత్రం మన అతిలోక సుందరి శ్రీదేవినే. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్​గా వెలుగొందిన శ్రీదేవినే తొలిసారిగా కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్​గా రికార్డుకెక్కింది! నిర్మాతలు ఆమెకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కాదనకుండా ఆ రెమ్యునరేషన్ అందించారట.

herione one crore rupees remuneration
శ్రీదేవి

సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణి
Sridevi Biography : 1963 ఆగస్టు 13న తమిళనాడులోని మీనంపట్టి గ్రామంలో జన్మించిన శ్రీదేవి.. నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే బాలనటిగా కెరీర్ ప్రారంభించారు. బాలనటిగా మెప్పించడమే కాకుండా యవ్వనంలో హీరోయిన్​గా విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. ఆమె నటించిన అన్ని భాషల్లో దాదాపు అందరు టాప్ హీరోల సరసన నటించారు. అలా టాప్ హీరోయిన్​గా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా ఏలారు.

herione one crore rupees remuneration
శ్రీదేవి

హిమ్మత్​ వాలా తర్వాత..
Sridevi Movie Career : శ్రీదేవి.. 1976లో తమిళ చిత్రం మూండ్రు ముడిచులో తన మొదటి ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆమె కమల్ హాసన్, రజనీకాంత్‌లతో కలిసి అనేక చిత్రాలలో పనిచేశారు. 1983లో ఆమె నటించిన హిమ్మత్‌వాలా చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతకంటే ముందు ఆమె బాలీవుడ్‌లో పలు చిత్రాలు చేసినప్పటికీ అవేవీ చెప్పుకోదగిన స్థాయిలో గుర్తింపునివ్వలేదు. హిమ్మత్ వాలా సక్సెస్ తరువాత శ్రీదేవి ఇక వెనుక్కు తిరిగి చూసుకోలేదు.

herione one crore rupees remuneration
శ్రీదేవి మైనపు బొమ్మ

'శ్రీదేవితో నటిస్తే మమ్మల్ని ఫ్యాన్స్​ గుర్తించడం లేదు!'
ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఆమెతో కలిసి నటిస్తే తమను ఎవ్వరూ గుర్తించడం లేదని.. అభిమానులు, ఆడియెన్స్ ఫోకస్ అంతా శ్రీదేవిపైనే ఉంటోంది అని చెప్పుకొచ్చారు. అందుకే ఆమెతో సినిమాలు చేయాలంటే భయం వేస్తోందని సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. హీరోలను సైతం అభద్రతా భావానికి గురిచేసేంత గొప్ప ఇమేజ్ శ్రీదేవి సొంతం! దటీజ్ శ్రీదేవి స్టామినా!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.