Ilayaraja Songs : ఒకరేమో మ్యూజిక్ మాస్ట్రో.. మరొకరేమో దర్శక దిగ్గజం.. ఇద్దరు సినిమా ఫీల్డ్‌లోని వేర్వేరు రంగాలకు చెందిన వారే.. అయినప్పటకీ వీరి కాంబో తెరపై ఎన్నో మ్యాజిక్‌లను క్రియేట్ చేసింది. వారే ఇళయరాజా-మణిరత్నం. 90స్లో మణిరత్నం తెరకెక్కించిన పలు సెన్సేషనల్ సినిమాలకు రాజా స్వరాలు అద్భుత ఫలితాలను అందించాయి. వీరిద్దరు కలిసి పని చేసింది తక్కువ సినిమాలకే అయినప్పటికీ అవి ప్రేక్షకుల్లో చెరగని ముద్రలు వేశాయి. మాస్ట్రో ఇళయరాజా పాటలను ఇష్టపడని వారంటూ ఉండరు. అలాగే మణి రత్నం సినిమాలు కూడా. ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్‌పీస్. యావత్ సౌత్ ఇండిస్ట్రీతో పాటు నార్త్‌లోనూ మణి రత్నం సినిమాలు ఇళయరాజా బాణీలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్నాయి. ఎన్నో ఎమెషన్స్కు ఒక్కసాంగ్‌తో హృదయానికి హత్తుకునేలా చేసేది ఒకరైతే.. ఆ ఎమెషన్స్ అన్నింటిని కళ్లకు కట్టినట్టుదా చూపించి అభిమానులను భావోద్వేగాలకు గురిచేసేది మరొకరి వంతు. ఇక ఈ ఇద్దరి కాంబో వచ్చిన సాంగ్స్‌ను ఓ సారి లుక్కేద్దామా..
- మణిరత్నం తెరకెక్కించిన తొలి సినిమా 'పల్లవి అనుపల్లవి'. కన్నడలో రూపొందిన ఈ సినిమాకు స్వరాలు సమకూర్చింది ఇళయరాజానే. ఇందులోని ప్రతి పాటను 90స్ అభిమానులకు ఎంతగానో నచ్చాయి.ఆ తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేసిన రెండో సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఉనారో అనే మలయాళం సినిమా కోసం ఈ ఇద్దరు పని చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఇక ఆ తర్వాత ఈ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ 'పూ మాలయే'. ఇందులోని 'వైదేగీ రామన్' అంటూ సాగే ఓ సాంగ్‌ను ఇళయరాజా-ఎస్ జానకీ పాడారు. ఈ సాంగ్ అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
- ఇళయరాజా మణిరత్నం కాంబోలో వచ్చిన నాలుగో సినిమా 'ఇదయ కోవిల్'. ఇందులోని 'ఇదయం ఒరు కోవిల్' అనే సాంగ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
- మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ 'మౌనరాగం'కి కూడా మ్యూజిక్ మాస్ట్రో స్వరాలను అందించారు. ఇందులో ప్రతి పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో ఉండి తీరాల్సిందే. అంతలా హిట్ అయ్యింది ఈ సాంగ్స్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఇళయారాజ మ్యూజికల్ జర్నీలో నిలిచిన మరో హిట్ మూవీ 'నాయకుడు'. ఈ సినిమాకు మణిరత్నం దర్శకతం వహించిన ఈ సినిమాలోని 'ఓ చుక్క రాలింది' అనే సాంగ్ ఇప్పటికీ హిస్టరీలో అలా నిలిచిపోయింది.
- Maniratnam Movies : 'నిన్ను కోరి వర్ణం' అనే సాంగ్ ఇప్పటికీ ఎంతో మంది నోట్లో నానుతూనే ఉంటుంది. ఆ పాట అంతలా హిట్ అవ్వడానికి కారణం ఇళయరాజా స్వరాలనే చెప్తారు అభిమానులు. అయితే ఈ సాంగ్ మణిరత్నం తెరకెక్కించిన 'ఘర్షణ' సినిమాలోనిది కావడం విశేషం..
- ఇక తెలుగు ఇండస్ట్రీలో క్లాసికల్ హిట్‌గా వచ్చి ఎన్నో సెన్సేషన్స్‌ను క్రియేట్ చేసిన మణిరత్నం మూవీ 'గీతాంజలి'. రాజా-మణి కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సినిమాలాగే ఇందులోని సాంగ్స్ కూడా మూవీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'ఓ ప్రియా ప్రియా'.. 'ఆమని పాడవే హాయిగా'.. 'ఓ పాపా లాలి'..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోని అన్నీ సాంగ్స్ మాస్టర్పీస్లే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఇళయరాజా స్వరాలు సమకూర్చిన 500వ సినిమా మణిరత్నంది కావడం విశేషం. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన 'అంజలి' సినిమా అభిమానులను భావోద్వేగాలకు గురిచేసింది. ముఖ్యంగా 'అంజలి అంజలి' సాంగ్ ఇప్పటికీ మనం ఎన్నో సందర్భాల్లో వినుంటాము.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- స్నేహం, ప్రేమ, పగ.. ఇలా అన్ని ఎమెషన్స్‌ను ఓ సాంగ్‌లో చూపించాలంటే అది కష్టంతో కూడుకున్న పని అయితే మ్యూజికల్ మాస్ట్రో ఈ పనిని అలవోకగా చేసి ఇండస్ట్రీకి ఓ సెన్సేషనల్ హిట్‌ను అందించారు. రజనీ- మమ్ముట్టి లాంటి స్టార్స్‌ను పెట్టి ఓ అద్భుతమైన సినిమాను మణిరత్నం తెరకెక్కిస్తే.. దానికి ఇళయరాజా సాంగ్స్ ఊపిరి పోసింది. 'సింగారాల పైరుల్లోన'.. 'చిలకమ్మ చిటికేయంగా'.. 'యమునా తటిలో' లాంటి సాంగ్స్‌ను ఎప్పుడు విన్నా ఇంకా వినాలనిపించేలా ఉంటాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- ఇవీ చదవండి:
- ఆయన మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి: చిరంజీవి
- కమల్ హాసన్‌తో మణిరత్నం భారీ ప్రాజెక్ట్.. 35 ఏళ్ల తరువాత క్రేజీ కాంబో