Hanuman Movie Review : థియేటర్ల సమస్యలు, తక్కువ స్క్రీన్స్, చిన్న హీరో అంటూ ట్రోల్స్ - ఇలా హనుమాన్ విడుదలకు ఎన్నో అడ్డంకులు కానీ చివరికీ అవేమీ సినిమా జోరుకు బ్రేకులు వెయ్యలేకపోయాయి. నేడు థియేటర్లో విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌ను అందుకుంది. జై హనుమాన్ అంటూ థియేటర్లు మార్మోగిపోతున్నాయి. కంటెంట్‌లో మ్యాటర్ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్న మాటను మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పుడీ విజువల్ ఫీస్ట్ సినిమాను థియేటర్లలోనే చూసేందుకు సినీ ప్రియులంతా రెడీ అయిపోతున్నారు. ప్రీమియర్ షోస్ నుంచే అంతలా ఆకట్టుకుంటోందీ చిత్రం.
వాస్తవానికి పేరుకే తెలుగు సినిమానే అయినా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా హైప్‌ను క్రియేట్ చేసుకుంది. బడా సినిమాల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించేసుకుంది. అ, కల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ - ఈ సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
ముఖ్యంగా తనకిచ్చిన పరిమిత బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. పిల్లలు, పెద్దలు మెచ్చేలా సినిమాని చక్కగా ముస్తాబు చేశారు. అందుకే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ చూసిన అభిమానులు, సినీ ప్రియులు, నటీనటులు సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. హనుమంతు పాత్రలో సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ అదరగొట్టేశారని, ఇక సూపర్ పవర్స్ వచ్చాక అటు యాక్షన్‌లోనూ ఇటు ఎమోషన్స్ సన్నివేశాల్లోనూ అతడు తన పాత్ర పరిధి దాటకుండా చక్కటి నటనను కనబరిచారని ప్రశంసిస్తున్నారు. ఎమోషన్స్, డ్రామాతో సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు.
-
India lo okate slogan ayyiundali adi #JaiShreeRam ayyiundali #JaiHanuman ayyiundali 🚩
— Chill_mawa 😅 (@yash09143) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Last 10 mins is enough to say that its worth every penny of yours 🥵🔥
Goosebumps over loaded ❤️🔥🔥 @PrasanthVarma @tejasajja123
Worth varma worthuuu!!! 🥵💥#Hanuman #HanuManRAMpage pic.twitter.com/kmUIopbhQo
">India lo okate slogan ayyiundali adi #JaiShreeRam ayyiundali #JaiHanuman ayyiundali 🚩
— Chill_mawa 😅 (@yash09143) January 11, 2024
Last 10 mins is enough to say that its worth every penny of yours 🥵🔥
Goosebumps over loaded ❤️🔥🔥 @PrasanthVarma @tejasajja123
Worth varma worthuuu!!! 🥵💥#Hanuman #HanuManRAMpage pic.twitter.com/kmUIopbhQoIndia lo okate slogan ayyiundali adi #JaiShreeRam ayyiundali #JaiHanuman ayyiundali 🚩
— Chill_mawa 😅 (@yash09143) January 11, 2024
Last 10 mins is enough to say that its worth every penny of yours 🥵🔥
Goosebumps over loaded ❤️🔥🔥 @PrasanthVarma @tejasajja123
Worth varma worthuuu!!! 🥵💥#Hanuman #HanuManRAMpage pic.twitter.com/kmUIopbhQo
Hanuman Movie VFX : వీఎఫ్ఎక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ - క్లైమాక్స్ 30 నిమిషాలు అద్భుతమని, కొన్ని షాట్స్ అయితే మెంటల్ స్టఫ్ అని చెబుతున్నారు. ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మకు నార్త్‌లో కచ్చితంగా డిమాండ్ పెరుగుతుందని అంటున్నారు. హనుమాన్ మూవీ ఓ కంప్లీట్ విజువల్ వండర్ అని ట్రెండ్ చేస్తున్న సినీ ప్రియులు - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ట్యాగ్ చేస్తున్నారు. హనుమాన్ మూవీని చూసి ఆదిపురుష్ తీయాల్సిందని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో సూపర్ హిట్ అందించిన ప్రశాంత్ వర్మను చూసి ఓం రౌత్ నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
-
Interval & climax 🔥🔥🔥@PrasanthVarma 🙇@tejasajja123 🤩superb film#Hanuman #HanuManRAMpage #HanumanReview #Hanumanblockbuster 💥💥 pic.twitter.com/Cpuzv4nnle
— Parjanya (@Parjanya29) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">Interval & climax 🔥🔥🔥@PrasanthVarma 🙇@tejasajja123 🤩superb film#Hanuman #HanuManRAMpage #HanumanReview #Hanumanblockbuster 💥💥 pic.twitter.com/Cpuzv4nnle
— Parjanya (@Parjanya29) January 11, 2024Interval & climax 🔥🔥🔥@PrasanthVarma 🙇@tejasajja123 🤩superb film#Hanuman #HanuManRAMpage #HanumanReview #Hanumanblockbuster 💥💥 pic.twitter.com/Cpuzv4nnle
— Parjanya (@Parjanya29) January 11, 2024
రివ్యూ : 'హనుమాన్' విశ్వరూపం - గూస్బంప్స్ గ్యారంటీ
రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?