Hanuman Movie Part 2: 2024 సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో 'హనుమాన్' మోస్ట్ అట్రాక్షన్‌గా మారింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హై లెవెల్ గ్రాఫిక్స్‌తో హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించారు. తేజ సజ్జ కథానాయకుడు. అయితే ఇప్పటికే పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియెన్స్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. 'హనుమాన్'కు రెండో పార్ట్ కూడా ఉండనున్నట్లు సినిమా చివర్లో హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'జై హనుమాన్' పేరుతో 2025లో ఈ సినిమా సెకెండ్ పార్ట్ రానుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరలవుతోంది. కానీ, ఈ విషయం గురించి మూవీటీమ్ ప్రమోషన్స్ టైమ్‌లో ఎక్కాడా చెప్పలేదు. ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు. మరి దీని గురించి పూర్తిగా తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
-
#HanuMan Part 2 Has Been Titled as #JaiHanuMan in Theatres in 2025 💥💥💥💥💥💥
— Movies4u Official (@Movies4u_Officl) January 11, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#HanuMan Part 2 Has Been Titled as #JaiHanuMan in Theatres in 2025 💥💥💥💥💥💥
— Movies4u Official (@Movies4u_Officl) January 11, 2024#HanuMan Part 2 Has Been Titled as #JaiHanuMan in Theatres in 2025 💥💥💥💥💥💥
— Movies4u Official (@Movies4u_Officl) January 11, 2024
Prasanth Varma Cinematic Universe: మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ సూపర్ హీరో కథాంశంతో 'హనుమాన్' తెరకెక్కించానని చెప్పిన ప్రశాంత్, అలాంటివి తన వద్ద మరో 10కి పైగా స్టోరీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆ లిస్ట్‌లో హాలీవుడ్ సెన్సెషనల్ అవతార్, మహాభారతం ఉన్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా చేసిన హనుమాన్ హిట్టైతే నెక్ట్స్, అవతార్ లాంటి ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తాన్నారు. ఈ విషయంలో ఎవరైన తనను ట్రోల్ చేయలంటే, ఆ ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యాక ట్రోల్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఆయన వల్లే డ్రాప్ అయ్యా: అయితే తన సినిమాటిక్ యూనివర్స్‌లో మహాభారతం కూడా ఉందన్న ప్రశాంత్, దర్శకధీరుడు రాజమౌళి ఆ ప్రాజెక్ట్ ప్రకటించడం వల్ల తను డ్రాప్ అయినట్లు తెలిపారు.
Hanuman Cast: ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్స్‌లో నటించగా, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, దీపక్ శెట్టి ఆయా పాత్రలు పోషించారు. ఇక ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హలీవుడ్ మూవీతో హనుమాన్ పోటీ - అక్కడ తొలి తెలుగు చిత్రంగా రికార్డ్!