ETV Bharat / entertainment

'మా అండగా ఆయన ఉన్నారు అందుకే వస్తున్నాం' - 'హనుమాన్' రిలీజ్​ డేట్​పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 19, 2023, 4:16 PM IST

Hanuman Director Prasanth Varma: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'హనుమాన్'. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్​ గురించి డైరెక్టర్​ ప్రశాంత్​ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Hanuman Director Prasanth Varma
Hanuman Director Prasanth Varma

Hanuman Director Prasanth Varma : 'జాంబీ రెడ్డి' తర్వాత యంగ్​ హీరో తేజ సజ్జ - ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ 'హనుమాన్'. మైథలాజికల్ కాన్సెప్ట్​తో పూర్తి భిన్నంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే రీలీజైన టీజర్​తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది మూవీ టీమ్. హాలీవుడ్ రేంజ్ వీఎఫ్​ఎక్స్, గ్రాండ్ స్క్రీన్ వర్క్స్ తో వచ్చిన టీజర్​కు అశేష స్పందన లభించగా, తాజాగా వచ్చిన ట్రైలర్​ కూడా అంచనాలు మించి ఫ్యాన్స్​ను ఆకట్టుకుంది. అయితే సంక్రాంతి బరిలో 'గుంటూరు కారం' సినిమాకు పోటీగా రానుంది. అయితే ఈ ప్రశ్నకు ట్రైలర్​ లాంచ్​ ఈవెంట్​లో డైెరెక్టర్ ప్రశాంత్ వర్మ సమాధానం ఇచ్చారు.

'మాది చిన్న చిత్రమే అయినా అందరికన్నా పెద్ద హీరో హనుమంతుడు మా అండగా ఉన్నారనే ధైర్యంతో మేము వస్తున్నాం. అంతే కాదు తెలుగులో 400 థియేటర్స్​లో, హిందీలో 1500 పైగా స్క్రీన్లలో ఈ 'హనుమాన్' సినిమా విడుదల కావటం మాకు చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మరిన్ని థియేటర్స్​లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.' అని ప్రశాంత్ వర్మ చెప్పారు. అలానే సినిమా విడుదల తేదీ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ముందు నుంచే ఈ డేట్​ను ప్రకటించామని అంతే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో అగ్రిమెంట్ చేసుకోవటం వల్ల ఈ చిత్రాన్ని అదే రోజున విడుదల చేస్తున్నామంటూ స్పష్టంగా చెప్పారు ప్రశాంత్ వర్మ.

Hanuman Cast : ఈ సినిమాలో తేజతో పాటు అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీ రోల్స్​లో నటించారు. వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. నిర్మాత నిరంజన్​రెడ్డి ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. గౌర హరి, అనుదీప్‌ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 2024 జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్​గా రిలీక్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

VFX వండర్స్​, BGM థండర్స్- హాలీవుడ్​ లెవెల్లో 'హనుమాన్' ట్రైలర్ ​

మహేశ్​కే సవాల్ విసురుతున్న యంగ్ హీరో.. ఏకంగా ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాడుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.