ETV Bharat / entertainment

'హనుమాన్‌' డైరెక్టర్​ సూపర్‌ ఆఫర్‌ - ఆ లక్కీ ఛాన్స్​ దక్కించుకునేదెవరో? - హనుమాన్ సినిమా సంక్రాంతి

Hanuman Director Prasanth Varma : 'హనుమాన్‌' మూవీ దర్శకుడు ప్రశాంత్​ వర్మ ఓ సూపర్ ఆఫర్ ప్రకటించారు. అదేంటంటే?

Hanuman
Hanuman
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 3:18 PM IST

Hanuman Director Prasanth Varma : ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్​, ట్రైలర్ ఇలా అన్నీ చిత్రంపై అంచనాలను భారీగానే పెంచాయి. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినప్పటికీ పెద్ద సినిమా రేంజ్​ మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే రిలీజ్ డేట్ దగ్గరపడటం వల్ల డైరెక్టర్​ ప్రశాంత్‌ వర్మ ఓ సువర్ణావకాశం ఇచ్చారు. 'హనుమాన్‌' కోసం పోస్టర్లు డిజైన్‌ చేస్తున్న పలువురు నెటిజన్లకు ఆఫర్ ప్రకటించారు. 'హనుమాన్‌' కోసం ఇప్పటి వరకు మీరు క్రియేట్‌ చేసిన అద్భుత డిజైన్లను చూసి ఎంతో ఆనందించాను. మీరు షేర్‌ చేసిన పోస్టర్లలో కొన్ని చూసి ఆశ్చర్యపోయాను. మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నాను. ఇకపై మీరు చేసే డిజైన్లను #HanuMania హ్యాష్‌ట్యాగ్‌ జత చేసి షేర్‌ చేయండి. బెస్ట్​గా డిజైన్​ చేసిన వారికి నా నెక్స్ట్​ ప్రాజెక్ట్‌లో వర్క్‌ చేసే అవకాశం ఇస్తాను" అని ప్రశాంత్ వెల్లడించారు.

Hanuman Movie Release Date : 'జాంబిరెడ్డి' తర్వాత ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. తేజ సజ్జా హీరోగా నటించారు. సినిమాలో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. కోలీవుడ్​ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ డైరెక్టర్​ సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్​పై నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్​ వైడ్​గా రిలీజ్​ కానుంది. తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం ఇలా మొత్తంగా 11 భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఈ నెల 7న జరగనున్న 'హనుమాన్‌' ప్రీ రిలీజ్‌ ఈవెంట్​కు మెగాస్టార్​ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి సందడి చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​ను దాటేసిన తేజ సజ్జ - సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' టాప్‌!

సంక్రాంతి హీరోల రెమ్యునరేషన్​- మహేశ్, వెంకీ, నాగ్​, తేజ ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.