ETV Bharat / entertainment

ఘనంగా నీలిమ గుణ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. హాజరైన మహేశ్‌, బన్నీ, జక్కన్న - నీలిమ గుణశేఖర్ సినిమాలు

వివాహ బంధంలోకి ఇటీవల అడుగుపెట్టారు నిర్మాత నీలిమ గుణ. ఆదివారం ఏర్పాటు చేసిన ఆమె రిసెప్షన్‌కు మహేశ్​ బాబు, అల్లు అర్జున్​ సహా పలువురు ప్రముఖుల హాజరయ్యారు.

gunasekhar daughter neelima marriage reception

author img

By

Published : Dec 11, 2022, 9:46 PM IST

Neelima Guna Wedding Reception: టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తనయ నీలిమ వెడ్డింగ్‌ రిసెష్షన్‌ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై, నవ దంపతులను ఆశీర్వదించారు. అగ్ర కథానాయకులు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, రాజశేఖర్‌ దంపతులు, దర్శకుడు రాజమౌళి దంపతులు, కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు మణిశర్మ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

వేడుకకు వచ్చిన చిన్నారితో అల్లు అర్జున్​

'బాల రామాయణం', 'చూడాలని ఉంది', 'ఒక్కడు', 'అర్జున్‌', 'వరుడు', 'రుద్రమదేవి' తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన గుణ శేఖర్‌ పెద్ద కుమార్తె నీలిమ. 'రుద్రమదేవి'కి సహ నిర్మాతగా వ్యవహరించిన ఆమె 'శాకుంతలం' సినిమాతో నిర్మాతగా మారారు. సమంత ప్రధాన పాత్రధారిగా గుణ శేఖర్‌ తెరకెక్కించిన ఆ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. వ్యాపారవేత్త అయిన రవి ప్రక్యాతో నీలిమ ఈ నెల 3న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

కొత్త దంపతులతో జక్కన్న దంపతులు
కొత్త దంపతులతో రాజశేఖర్, జీవిత
కొత్త జంటతో మహేశ్​, బన్నీ
నూతన దంపతులతో మహేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.