ETV Bharat / entertainment

కొనసాగుతున్న 'వీర సింహారెడ్డి' కలెక్షన్ల జోరు​.. సినిమాలో అది బాలయ్య ఐడియానేనట! - వీరసింహా రెడ్డి కాస్ట్యూమ్స్​

సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి భారీ కలెక్షన్స్​ దిశగా దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రం గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఆ సంగతులతో పాటు ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.

Balakrishna Veerasimha reddy
'వీర సింహారెడ్డి' భారీ కలెక్షన్స్​.. సినిమాలో అది బాలయ్య ఐడియానేనట!
author img

By

Published : Jan 20, 2023, 5:17 PM IST

Updated : Jan 20, 2023, 6:38 PM IST

నందమూరి నటసిహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఇటీవలే సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్​ టాక్​తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా బాలయ్య లుక్​, డ్రెస్సింగ్​ సెన్స్ మరింత ఆకట్టుకున్నాయి. అయితే​ ఈ సినిమా విజయం సాధించడం వల్ల దర్శకుడు గోపిచంద్ మలినేని వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా విజయంపై మరోసారి హర్షం వ్యక్తం చేస్తూ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. సినిమాలో జై బాలయ్య పాట ఎందుకు పెట్టారు? ఆయన కాస్ట్యూమ్స్​ గురించి చెప్పుకొచ్చారు.

"అటు మాస్​ థియోటర్​లో ఇటు​ మల్టీప్లెక్స్​లో సినిమా చూశాను. మాస్​తో పాటు ఫ్యామిలీ ఆడియోన్స్ కూడా​ బాగా కనెక్ట్ అయ్యారు. అసాధారణమైన రెస్పాన్స్ వచ్చింది. నా ఫోన్లు ఇప్పటివరకు మోగుతూనే ఉన్నాయి. ఇండస్ట్రీ నుంచి చాలా మంది కాల్స్ చేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాగా చూపించావని అంటున్నారు. బాలయ్య కాస్ట్యూమ్స్​ విషయానికొస్తే ఆయన క్యారెక్టర్​కు బాగా డెప్త్​ ఉంటుంది. డిజైన్​ చేసేటప్పుడే స్కెచెస్​ వేయించాను. ఆ తర్వాత బాల్యయకు అది చూపించాను. అయితే మొదట నా మనసులో బ్లాక్​ షర్ట్​ వేద్దాం అన్నప్పుడు బాలయ్యను అడగలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ అప్పుడే బాలయ్య కూడా తమ మనసులో బ్లాక్ ఉందని చెప్పారు. దీంతో నేను కూడా అదే అనుకున్నా సార్​ అంటూ డిజైన్ చూపించాను. ఇక యంగ్ లుక్ బాలయ్య కోసం భాస్కర్​ డిజైనర్​. ఆయన ప్రభాస్​కు పర్సనల్​ డిజైనర్​. ఇక జై బాలయ్య డైలాగ్​ ఓ ట్రెండ్ అయిపోయింది. అందుకే ఆ డైలాగ్ పెట్టాను. జై బాలయ్య పాట విషయానికొస్తే.. ఆ పదం ఓ ఎమోషన్​ అయిపోయింది. అందుకే ఆ పాట ఉంటే ఓ మ్యాజిక్ క్రియేట్​ అవుతుంది నేను తమన్ అనుకున్నాం. అందుకే​ చేశాం. అది వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఆదరిస్తారని అనుకున్నాం. ఆదరించారు." అని గోపిచంద్​ అన్నారు.

ఇక వీరసింహారెడ్డి సినిమా విషయానికొస్తే.. మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రోర్​ మాములుగా లేదంటున్నారు అభిమానులు. జై బాలయ్య అన్న నినాదంతో థియేటర్లు దద్దరిల్లిపోయాయనే చెప్పాలి. ఇక బాలయ్య అటు యాక్షన్​తో పాట ఇటు సెంటిమెంట్​ను బ్యాలెన్స్​ చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించారు.​ ఈ సినిమాలో నటించిన ఇతర తారలు దునియా విజయ్​, వరలక్ష్మీ శరత్​కుమార్​, శ్రుతిహాసన్​, హనీ రోజ్​ సైతం తమదైన శైలిలో నటించి సీన్స్​ పండించారు. ఇప్పటివరకు విడుదలైన రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా రూ.119 కోట్ల గ్రాస్​ సాధించినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం.

ఇదీ చూడండి: పవర్​ఫుల్ పోలీస్​గా అందాల భామలు.. తుపాకీ గురి పెట్టి.. విలన్లతో పోరాడి

Last Updated : Jan 20, 2023, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.