ETV Bharat / entertainment

83 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న'గాడ్ ఫాదర్' హీరో.. 29 ఏళ్ల యువతితో.. - Al Pacino Noor Alfallah Child

Al Pacino Becoming Father 4th Time : 'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు హాలీవుడ్ నటుడు అల్​ పసినో. అయన 83 వయసులో నాలుగోసారి తండ్రి కాబోతున్నారు. ఆ వివరాలు..

Al Pacino Noor Alfallah Dating
ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో అల్ పసినో
author img

By

Published : May 31, 2023, 5:19 PM IST

Al Pacino Becoming Father 4th Time : హాలీవుడ్ స్టార్​ నటుడు అల్ పసినో (83) తండ్రి కాబోతున్నారు. ఆయన ప్రేయసి, సినిమా నిర్మాత నూర్​ అల్ఫాల్లా(29) వచ్చే నెలలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ విషయాన్ని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇప్పటికే అల్ పసినోకు ఇప్పటికే ఓ కూతురు(33), కవల పిల్లలు ఉండగా.. ఇప్పుడు నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా, 2022 నుంచి అల్ పసినో, నూర్ అల్ఫాల్లాతో డేటింగ్​లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజా వార్త బయటకు వచ్చింది.

Al Pacino Relations : 'గాడ్ ఫాదర్' సినిమాతో ప్రపంచానికి పరిచయమయ్యారు అల్ పసినో. ఆయన 1988లో జాన్ టర్రంట్‌తో రిలేషన్​షిప్​ ప్రారంభించారు. ఒక సంవత్సరం తర్వాత వీరికి బ్రేకప్ అయ్యింది. వీరిద్దరికి 33 ఏళ్ల కూతురు ఉంది. ఆ తర్వాత పరిచయం ఏర్పడిన బెవెర్లీ డీ ఏంజెల్లోతో 1997 నుంచి 2003 వరకు ఆరేళ్ల పాటు సహ జీవనం చేశారు. వీరి దాంపత్య జీవిత సమయంలో కవల పిల్లలు జన్మించారు. అనంతరం అల్ పసినో.. బెవెర్లీ డీ ఏంజెల్లోతో విడిపోయిన నాలుగేళ్లకు 2008 నుంచి లుసిలా పొలాక్‌తో రిలేషన్​లో ఉన్నారు. దాదాపు పదేళ్ల పాటు రిలేషన్​షిప్​లో ఉన్న వీరిద్దరు.. వ్యక్తిగత కారణాల వల్ల 2018లో బ్రేకప్​ చెప్పుకున్నారు. ప్రస్తుతం అల్ పసినో.. 29ఏళ్ల నూర్ అల్ఫాల్లాతో సహ జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె సినీ నిర్మాత. ఆమె గతంలో సింగ్ మిక్ జాగర్‌ అనే వ్యక్తితో, తర్వాత ప్రముఖ పారిశ్రామిక వేత్త నికోలాస్ బెర్గ్ర్యూన్‌తో డేటింగ్ చేశారు.

Al Pacino Noor Alfallah Dating
ప్రేయసి నూర్ అల్ఫాల్లాతో అల్ పసినో

Al Pacino Career : అల్ పసినో 1969లో 'మీ నాటలే' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత 1972లో 'ది గాడ్ ఫాదర్' సినిమాలో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1974లో వచ్చిన 'ది గాడ్ ఫాదర్ పార్ట్ 2'లోనూ నటించారు. ఆ తర్వాత 'రెవల్యూషన్', 'సీ ఆఫ్ లవ్', 'స్కార్ ఫేస్', 'సెంట్ ఆఫ్ ఏ ఉమెన్', 'ది ఇన్‌సైడర్' చిత్రాల్లో నటించారు. తాజాగా 'వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్', 'ది ఐరీష్ మ్యాన్', 'ది పైరేట్స్ ఆఫ్ సోమాలియా' వంటి తదితర చిత్రాల్లో నటించారు.

Robert De Niro 7th Child : ఇకపోతే 'ది గాడ్ ఫాదర్ పార్ట్ 2'లో అల్ పసినో కో-స్టార్ రాబర్ట్ డి నరో కూడా 79 ఏళ్ల వయసులో ఏడోసారి తండ్రి అయ్యారు. తాను నటించిన "అబౌట్​ మై ఫాదర్" సినిమా ప్రమోషన్స్​లో ఈ విషయాన్ని తెలిపారు. యూఎస్​ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో.. తండ్రి-పిల్లల అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.