ETV Bharat / entertainment

అదుర్స్‌ అనిపించేలా ది ఘోస్ట్‌ ట్రైలర్‌, ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో నాగార్జున - విక్రమ్​ లేటేస్ట్ మూవీ

Ghost trailer launch నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ది ఘోస్ట్‌. ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

ghost trailer launch
ghost trailer launch
author img

By

Published : Aug 25, 2022, 6:09 PM IST

Ghost trailer launch: ప్రముఖ నటుడు నాగార్జున తాజాగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రం 'ది ఘోస్ట్‌'. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్‌' ఆడుతున్న థియేటర్లలో గురువారం ఉదయం ప్రదర్శించారు. తాజాగా నటుడు మహేశ్‌బాబు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు.

ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా నాగార్జున లుక్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌ అందరితోనూ అదరహో అనిపించేలా ఉన్నాయి. యాక్షన్‌తోపాటు థ్రిల్లింగ్‌ అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. థీమ్‌కి తగ్గట్టు భరత్‌- సౌరభ్‌ అందించిన నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్‌ చౌహాన్‌ నటించారు. ఆమె కూడా ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గానే కనిపిస్తారు. ఇంటర్‌పోల్‌ అధికారి అయిన నాగార్జున ఖడ్గాన్ని ఎందుకు పట్టుకున్నారు? దాని ప్రత్యేకత ఏంటి? ఆపరేషన్‌ని పూర్తి చేశారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Cobra movie trailer: చియాన్​ విక్రమ్​ హీరోగా న‌టించిన 'కోబ్రా' సినిమా ట్రైలర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. భారీ అంచ‌నాలతో వస్తున్న ఈ చిత్రం ఆగ‌స్టు 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో విక్ర‌మ్ ఏడు విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో 'కేజీఎఫ్' భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌. ప్ర‌ముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్​ రెహ్మాన్​ సంగీతం అందించగా.. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి: నేహా శర్మ అందాల జాతర, హాట్ లుక్స్​తో నిక్కీ తంబోలి

లవ్​యూ రౌడీ హీరో, విజయ్​కు అర్జున్​ రెడ్డి బ్యూటీ స్పెషల్ మెసేజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.