ETV Bharat / entertainment

Genelia Deshmukh Pregnancy : జెనీలియా ప్రెగ్నెంట్! ఆ వీడియో చూశాక అందరిదీ ఇదే మాట! - జెనీలియా అప్డేట్స్

Genelia Deshmukh Pregnancy : బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ జెనీలియా దేశ్​ముఖ్​ తాజాగా తన భర్త రితేశ్​తో కలిసి ఓ ఈవెంట్​కు హాజరైంది. అయితే ఆమె ఇందులో బేబీ బంప్​తో కనిపించిందట. దీంతో తను మరోసారి ప్రెగ్నెంట్​ అన్న వార్తలు నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఆ విశేషాలు మీ కోసం.

Genelia Deshmukh Pregnancy
Genelia Deshmukh Pregnancy
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 2:02 PM IST

Updated : Sep 10, 2023, 3:50 PM IST

Genelia Deshmukh Pregnancy : హా హా హా హాసినీ అంటూ తన అమయాక్వతంతో ప్రేక్షకులను కట్టిపడేసింది బాలీవుడ్​ బ్యూటీ జెనీలియా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస ఆఫర్లతో దూసుకెళ్లిన ఈ అమ్మడు..'ఢీ', 'రెడీ', 'సై' లాంటి బ్లాక్‌ బస్టర్​ సినిమాలతో టాలీవుడ్​ ఆడియెన్స్​కు మరింత చేరువైంది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జెనీలియా.. బాలీవుడ్ స్టార్ హీరో రితేశ్​ దేశ్​ముఖ్​ను ప్రేమ వివాహం చేసుకుంది. బాలీవుడ్​లో మోస్ట్​ క్యూట్​ కపుల్​గా పేరొందిన ఈ జంటకు రియాన్​, రాహ్యల్​ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

అయితే తాజాగా జెనీలియా మరోసారి ప్రెగ్నెంట్​ అయ్యిందనే వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఇటీవలే తన భర్త రితేశ్​తో కలిసి ఆమె ఓ ఈవెంట్​కు హాజరైంది. అక్కడ మీడియా వీరిని ఫొటోలు తీసింది. అందులో వైలెట్​ కలర్​ వన్​ పీస్​ డ్రెస్​లో జెనిలీయా మెరిసింది. అయితే అందులో తనకు బేబీ బంప్​ ఉన్నట్లు అనిపించింది. దీంతో ఫ్యాన్స్ ఈ జంట తమ మూడో బేబీకి వెల్​కమ్​ చెప్పేందుకు రెడీగా ఉన్నారంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ విషయంపై అటు జెనీలియా కానీ ఇటు రితేశ్​గానీ స్పందించలేదు.

Genelia Latest Movie : ఇక జెనిలీయా.. పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆ గ్యాప్​లోనూ తన ఇన్​స్టా రీల్స్​తో ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది. తన భర్త రితేశ్​తో పాటు ఇతర స్నేహితులతో ఫన్నీ రీల్స్​ చేస్తూ నెట్టింట మరింత పాపులరైంది. తాజాగా వేద్​ అనే మారాఠీ సినిమాలో రితేశ్​తో కలిసి మెరిసింది. తెలుగులో 'మజిలీ'గా తెరకెక్కిన సినిమాకు రీమేక్​గా 'వేద్​' తెరకెక్కింది​.

Genelia Movie Career : 2003లో 'తుఝే మేరీ కసమ్​' అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది జెనీలియా. అదే ఏడాది తమిళంలో తెరకెక్కిన 'బాయ్స్‌' సినిమాలో నటించి కోలీవుడ్​ ఆడియెన్స్​ను పలకరించింది. ఆ తర్వాత తమిళంతో పాటు హిందీ , తెలుగు, మరాఠీ భాషల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. 'సత్యం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. ఆ తర్వాత 'బొమ్మరిల్లు', 'సాంబ‌', 'ఆరెంజ్', 'సై', 'సుభాష్ చంద్ర‌బోస్' లాంటి సినిమాల్లో మెరిసి ప్రేక్షకుల మెప్పు పొందింది.

కాలేజ్ స్టూడెంట్​గా మారిన 'జెనీలియా'.. అందుకేనట!

ట్రెడిషనల్​ వేర్​లో జెనీలియా.. ఫారెన్​లో సమంత.. ఈ పిక్స్​ను చూస్తే ఎవ్వరైనా..

Last Updated : Sep 10, 2023, 3:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.