ETV Bharat / entertainment

Tollywood Movies In Summer 2024 : సమ్మర్​ బాక్సాఫీస్ వార్​.. థియేటర్లలో ఆ స్టార్స్​దే సందడి.. - జూనియర్ ఎన్​టీఆర్​ దేవర మూవీ రిలీజ్​ డేట్

Tollywood Movies In Summer 2024 : ఎప్పటిలాగే రానున్న సమ్మర్​లో​ కూడా మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేయనున్నాయి. ఈ క్రమంలో నలుగురు స్టార్​ హీరోస్​ తమ పాన్ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్​ను షేక్​ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం..

Tollywood Movies In Summer 2024
pan india movies to be released in summer 2024
author img

By

Published : Aug 3, 2023, 3:59 PM IST

Tollywood Movies In Summer 2024 : రానున్న వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చేందుకు పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా బాక్సాఫీస్​ బరిలోకి తమ సత్తాను చాటేందుకు రెబల్ స్టార్​ ప్రభాస్, మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్, యంగ్​ టైగర్​ జూనియర్​ ఎన్​టీఆర్​, ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ ​ ముందుకొచ్చారు. ఇప్పటికే తమ నటనతో పాన్ ఇండియా లెవెల్​లో స్టార్​డం తెచ్చుకున్న ఈ హీరోలు.. ఈ సారి మరిన్ని కొత్త సినిమాలతో బక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. దాదపు రెండు, మూడు వారాల గ్యాప్‌లోనే తమ సినిమాల విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Ram Charan Game Changer Movie : 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​.. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గేమ్​ ఛేంజర్'​ సినిమాలో నటిస్తున్నారు. ఇండియాతో పాటు ఫారిన్​లోనూ పలు లొకేషన్లలో శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. అయితే రిలీజ్​ డేట్​పై ఇప్పటివరకు క్లారిటీ లేనప్పటికీ.. 2024 మార్చి రెండు లేదా మూడో వారంలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jr NTR Devara Movie : మరోవైపు యంగ్ టైగర్ ఎన్​టీఆర్​, కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న 'దేవర' సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకముందే రిలీజ్​ డేట్​ను ఖరారు చేసిన మూవీ మేకర్స్​ ఇప్పటికీ అదే రోజు విడుదల చేసేందుకు రెడీగా ఉన్నారు.

Allu Arjun Pushpa 2 Movie : ఇక ఇదే నెలలో ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్- లెక్కల మాస్టర్​ సుకుమార్ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'పుష్ప-2' సినిమా కుడా రిలీజయ్యే అవకాశాలున్నాయంట. ఏప్రిల్​ ఆఖరిలో ఎప్పుడైనా సరే ఈ సినిమా థియేటర్లలో సందడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని సినీ వర్గాల టాక్​.

Prabhas Kalki 2898 AD Movie : మరోవైపు రెబల్​ స్టార్​ ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ మూవీ 'కల్కి-2898 ఏడీ' కూడా మే నెలలో విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతుందని మూవీ మేకర్స్​ ఎప్పుడో చెప్పేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా ఈ సినిమా ఇప్పుడు అనుకున్న తేదీలో కాకుండా మే 9న థియేటర్లోకి రానుందని సినీ వర్గాల టాక్​. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు మూవీ మేకర్స్ ఎటువంటి అప్డేట్​ ఇవ్వలేదు.

ఇలా రానున్న సమ్మర్​ మొత్తం భారీ బడ్జెట్​ మూవీస్​తో సందడి చేయనుంది. ఇక ప్రభాస్​, చరణ్​, బన్నీ, తారక్ లాంటి టాప్​ స్టార్స్​ సినిమా అంటే ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటోంది. దీంతో ఫ్యాన్స్​ సైతం ఈ సినిమాల రిలీజ్​ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.