ETV Bharat / entertainment

'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' మూవీ లోగో.. నిర్మాతగా మారిన తాప్సి - first day first show movielogo

ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు ఏడిద శ్రీజ.. 'శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడీ బ్యానర్‌లో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో' లోగోను ఆవిష్కరించారు. అలాగే తాప్సీ నిర్మాతగా మారిన సినిమా అప్డేట్​ మీకోసం..

First Day First Show movie log
‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ మూవీ లోగో
author img

By

Published : May 17, 2022, 6:33 AM IST

'శంకరాభరణం', 'సాగర సంగమం', 'స్వయంకృషి'.. ఇలా తెలుగు చిత్రసీమకు ఎన్నో ఆణిముత్యాలను అందించిన నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌. ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు స్థాపించిన ఈ సంస్థకు అనుబంధంగా 'శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరుతో ఆయన మనవరాలు ఏడిద శ్రీజ కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇప్పుడీ బ్యానర్‌లో ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం 'ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో'. వంశీధర్‌ గౌడ్‌, పి.లక్ష్మీనారాయణ దర్శకులుగా పరిచయమవుతున్నారు. 'జాతిరత్నాలు' ఫేమ్‌ కె.వి.అనుదీప్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బసు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ లోగోను దర్శకుడు నాగ్‌అశ్విన్‌ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఏడిద నాగేశ్వరరావు, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌ది అద్భుత ప్రయాణం. అలాంటి గొప్ప సంస్థ మళ్లీ మొదలవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీలో వారి వారసులు నిర్మిస్తున్న చిత్రానికి నేను సహాయపడటం సంతోషంగా ఉంది. అనుదీప్‌ కథ ఇచ్చాడంటే చాలా ఫన్‌ ఉంటుంది. ఇది 'జాతిరత్నాలు' కంటే పెద్ద హిట్‌ కావాలి" అన్నారు. "కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. రథన్‌ మంచి సంగీతమందించారు" అని అన్నారు దర్శకుడు కె.వి.అనుదీప్‌. ఏడిద శ్రీరామ్‌ త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు. "మంచి కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంద"న్నారు చిత్ర దర్శకులు వంశీధర్‌, లక్ష్మీనారాయణ. "మా తాతగారి సినిమాలు చూసి పెరిగాం. ఈ బ్యానర్‌లో కుటుంబమంతా కలిసి చూస్తూ, హాయిగా నవ్వుకునే సినిమాలు చేయాలని ఈ చిత్రం నిర్మిస్తున్నాం" అన్నారు నిర్మాత ఏడిద శ్రీజ. కూర్పు: మాధవ్‌, ఛాయాగ్రహణం: ప్రశాంత్‌ అక్కిరెడ్డి.

'ధక్‌ ధక్‌' నిర్మాతగా తాప్సి.. విభిన్నమైన పాత్రల్లో నటిస్తూనే నిర్మాతగానూ తనదైన ముద్ర వేస్తున్న నటి తాప్సీ. దీనికోసమే 'ఔట్‌సైడర్స్‌ ఫిల్మ్స్‌' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇందులో ఇప్పటికే 'బ్లర్‌' అనే సినిమా మొదలైంది. తాజాగా 'ధక్‌ ధక్‌' చిత్ర నిర్మాణంలోనూ తన భాగస్వామ్యం ఉంటుందని ప్రకటించింది. ఈ చిత్రంలో ఫాతిమా సనా షేక్‌, రత్న పాఠక్‌, దియా మీర్జా, సంజనా సంఘీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వయోకామ్‌ 18 స్టూడియోస్‌, బీఎల్‌ఎమ్‌ పిక్చర్స్‌తో కలిసి తాను నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌ను సోమవారం ట్వీట్‌ చేసింది. తరుణ్‌ దుదేజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తాము కోరుకున్న స్వేచ్ఛను పొందిన నలుగురు మహిళల జీవితాన్ని చూపించనున్నారు.

ఇదీ చదవండి: సక్సెస్​ ఈవెంట్.. ఆనందంతో స్టేజ్​పై మహేశ్​ చిందులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.