ETV Bharat / entertainment

వివాదాల్లో రణ్​వీర్ సింగ్​..​ న్యూడ్​ ఫొటో షూట్​పై కేసు నమోదు - ranveer singh latest news

రణ్​వీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన న్యూడ్​ ఫొటోషూట్​పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముంబయిలో రణ్​వీర్ సింగ్​పై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

FIR against Ranveer Singh over his nude photoshoot, another complaint filed by lawyer
రణవీర్​ న్యూడ్​ ఫొటో షూట్​పై ఫైర్​.. కేసు నమోదు
author img

By

Published : Jul 26, 2022, 3:19 PM IST

బాలీవుడ్ స్టార్​ హీరో రణ్​వీర్ సింగ్ న్యూడ్​ ఫొటో షూట్​పై వివాదాలు రాజుకుంటున్నాయి. నగ్న ఫొటో షూట్​తో ఆశ్చర్యపరిచిన రణ్​వీర్​కు ఇప్పుడు కేసులు ఎదురుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. నగ్నచిత్రాలను పోస్ట్ చేసినందుకు కాను.. తాజాగా రణ్​వీర్ సింగ్‌పై ముంబయిలోని చెంబూరు పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది. మొత్త నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముంబయికి చెందిన న్యాయవాది చౌబే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన న్యూడ్​ ఫొటోల ద్వారా మహిళల మనోభావాలను రణవీర్ దెబ్బతీశారని తన ఫిర్యాదులో ఆరోపించారు చౌబే.

ముంబయికి చెందిన ఓ ఎన్జీవో కూడా రణ్​వీర్ సింగ్ న్యూడ్​ ఫొటో షూట్​పై ఫిర్యాదు చేసింది. పలువురు హీరోయిన్లు గతంలో ఇలాంటి న్యూడ్​ ఫొటో షూట్​ చేయించుకున్నారు. ఒక స్టార్​ హీరో తొలిసారి ఈ రకంగా ఫొటో షూట్​ చేయించుకోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి.

ఇదీ చదవండి: David Warner passed away: ప్రముఖ నటుడు డేవిడ్ వార్నర్ కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.