ETV Bharat / entertainment

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం - singeetam srinivasa rao latest news

Singeetham Srinivasarao: లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట్లో విషాదం నెలకొంది. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సతీమణి లక్ష్మీ కల్యాణి.. శనివారం రాత్రి చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.

SINGEETHAM SRINIVAS WIFE
singeetam srinivasa rao latest news
author img

By

Published : May 29, 2022, 3:06 PM IST

Singeetham Srinivasarao: ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి లక్ష్మీకళ్యాణి కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1960లో లక్ష్మీకళ్యాణితో సింగీతానికి వివాహమైంది. సినిమా స్క్రిప్ట్ రాయడంలో భర్తకు ఆమె ఎంతో సహకరించేవారు. 'పుష్పక విమానం' చిత్ర సమయంలో సింగీతాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించారు.

సింగీతం తీసిన ఎన్నో విజయవంతమైన చిత్రాల వెనుక కళ్యాణిగారు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో తన సతీమణితో జీవిత ప్రయాణంపై సింగీతం 2012లో 'శ్రీకళ్యాణీయం' అనే పుస్తకాన్ని రాశారు. లక్ష్మికళ్యాణి మరణ వార్త తెలిసిన పలువురు చిత్ర ప్రముఖులు నటీనటులు.. సింగీతాన్ని ఫోన్​లో పరామర్శించి సానుభూతి తెలిపారు.

ఇదీ చూడండి: జూనియర్​ ఎన్టీఆర్​ భావోద్వేగ ట్వీట్​.. ' ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా'​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.