ETV Bharat / entertainment

'ఆదిపురుష్'​పై దర్శకుడు ఓం రౌత్ స్పెషల్​​ ట్వీట్​.. ఫ్యాన్స్​ ఫైర్​ - ఫ్యాన్స్​ ఫైర్​ ప్రభాస్​ ఆదిపురుష్​

నేడు(ఆదివారం) శ్రీరామ నవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభాస్ 'ఆదిపురుష్​'పై ఓ ట్వీట్​​ చేశారు దర్శకుడు ఓం రౌత్​. అది చూసిన ఫ్యాన్స్​ మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్​ చేశారంటే..

prabhas adipurush
ప్రభాస్ ఆదిపురుష్​
author img

By

Published : Apr 10, 2022, 9:36 AM IST

Prabhas Adipurush Update: యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'ఆదిపురుష్'‌. ఇందులో ప్రభాస్​ శ్రీరాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్​ అలీఖాన్​ రావణాసురిడిగా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు శ్రీరామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని ప్రభాస్​ లుక్​ను విడుదల చేస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చిత్రబృందం ఎటువంటి అప్డేట్​ ఇస్తామని తెలుపలేదు. చిత్ర దర్శకుడు ఓం రౌత్​ మాత్రం పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ట్వీట్​ చేశారు. రాముడి లుక్​లో ప్రభాస్​ ఉన్నట్టుగా ఫ్యాన్స్​ ఎడిట్​ చేసిన ఫొటోలన్నింటినీ కలిపి ఓ వీడియోగా రూపొందించి ఆ ట్వీట్​కు జోడించారు. వచ్చే ఏడాది ప్రపంచవ్యాప్తంగా జనవరి 12నే థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పారు.

ఈ ట్వీట్​ కాసేపట్లోనే సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది అప్డేట్ ఇవ్వాలని కోరతుండగా మరికొంతమంది మాత్రం​ దర్శకుడిపై మండిపడుతున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో లంకేశుడి పాత్రలో బాలీవుడ్​ స్టార్​ సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.

  • उफनता वीरता का सागर,
    छलकती वात्सल्य की गागर।
    जन्म हुआ प्रभु श्रीराम का,
    झूमें नाचे हर जन घर नगर।।

    Celebrating the victory of good over evil✨#ramnavmi #adipurush pic.twitter.com/Xbl1kOgZ7z

    — Om Raut (@omraut) April 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆ సినిమా స్ఫూర్తితోనే.. నేడు శ్రీరామనవమి సందర్భంగా 'ఆదిపురుష్'​ సినిమా గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు దర్శకుడు ఓం రౌత్. రాముడి జీవితంలోని ఓ అధ్యాయాన్ని తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఓ జపనీస్​ చిత్రం స్ఫూర్తితో ​దీన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. "ప్రభాస్​ కళ్లు, ఫిజిక్​ రాముడి పాత్రకు సరిగ్గా సరిపోతాయి. మూడు సీన్లు విని ఆయన ఈ చిత్రాన్ని ఒప్పుకున్నారు. తను ఒప్పుకోకపోయి ఉంటే ఆదిపురుష్​ ఉండేది కాదు. దేవుడే ఇది తీయాలని నిర్ణయించారు. వేల ఏళ్ల క్రితం నాటి కథను మోడ్రన్​ టెక్నాలజీతో నేను చూపిస్తున్నాను." అని అన్నారు.

ఇదీ చూడండి: అమెరికాలో 'ఆర్​ఆర్​ఆర్'​ సరికొత్త రికార్డు.. వరల్డ్​లో టాప్​-3గా ఘనత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.