ETV Bharat / entertainment

'ఎఫ్​ 3' సాంగ్​ ప్రోమో.. సూపర్​గా కిరిటీ యాక్షన్​ స్టంట్స్​​! - గాలి జనార్ధన్​ కిరీటీ కొత్త సినిమా

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో ఎఫ్​ 3 సాంగ్​, హిందీ ఖైదీ రిలీజ్​ డేట్​, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరిటీ హీరోగా పరిచయం కాబోతున్న కొత్త సినిమా సంగతులు ఉన్నాయి. ఆ వివరాలు...

ఎఫ్​ 3 మూవీ అప్డేట్స్​
F3 movie updates
author img

By

Published : Apr 20, 2022, 11:01 AM IST

F3 movie song promo: అందరి 'ఫ్రస్టేషన్‌' పోగొట్టేందుకు, 'ఎఫ్‌ 2'కు మించిన 'ఫన్‌' పంచేందుకు 'ఎఫ్‌ 3' సినిమాతో రాబోతున్నారు వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలు కాగా సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ముగ్గురితోపాటు పూజాహెగ్డే అందం 'ప్రత్యేకం'గా నిలువనుంది. అయితే తాజాగా ఈ సినిమాలోని 'ఊ ఆ అహా అహా' అంటూ సాగే ప్రోమో సాంగ్​ను రిలీజ్​ చేసింది. పూర్తి లిరికల్​ గీతాన్ని ఏప్రిల్​ 22న రిలీజ్ చేస్తానని తెలిపింది. దీనికి దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందించారు. సునిధి చౌహాన్​, లవిత లోబో, సాగర్​, ఎస్పీ అభిషేక్​ కలిసి దీన్ని ఆలపించగా.. కసర్ల శ్యామ్​ లిరిక్స్​ అందించారు. కాగా, దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందిస్తున్నారు. ఈ చిత్రం మే 27న విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kireeti new movie glimpse: సినీ, రాజకీయ ప్రముఖుల వారసులు వెండితెరకు పరిచయం కావటం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు నటీనటులు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి కర్ణాటక మాజీ మంత్రి, వ్యాపారవేత్త గాలి జనార్దన్‌రెడ్డి తనయుడు కిరిటీ రెడ్డి వచ్చి చేరిన సంగతి తెలిసిందే. కిరీటిని హీరోగా పరిచయం చేస్తూ.. రాధాకృష్ణ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనుంది. దీన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'వారాహి' అనే టైటిల్​ పరిశీలనలో ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ గ్లింప్స్​ను.. బీటీఎస్​(బిహైండ్​ ది సీన్స్) అంటూ​ రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఇందులో కిరిటీ.. స్టంట్‌ డైరెక్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో యాక్షన్​ సన్నివేశాలను ప్రాక్టీస్​ చేస్తూ కనిపించారు. సినిమాలోని అన్ని స్టంట్​లను రియల్​గానే చేసేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. కాగా, లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించనుండగా.. ఆర్‌.రవీందర్‌ రెడ్డి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సెంథిల్‌ కుమార్‌ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Hindi Khaidi movie release date: కోలీవుడ్‌ నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన విభిన్న కథా చిత్రం 'ఖైదీ'. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో కార్తీ నటనను అభిమానులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 'ఖైదీ' చిత్రాన్ని హిందీలో 'భోళా'గా రీమేక్‌ చేయనున్నట్లు 2020లో బాలీవుడ్​ హీరో అజయ్​దేవగణ్​ ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ప్రకటించారు మేకర్స్​. 2023 మార్చి 30 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్​ కానున్నట్లు తెలిపారు. దీనికి ధర్మేంద్ర శర్మ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సీనియర్​ నటి తబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, కోలీవుడ్‌లో 'ఖైదీ' చిత్రాన్ని లోకేశ్‌ కనకరాజు తెరకెక్కించారు. కూతుర్ని చూడాలనుకునే తండ్రి ఆరాటం, తండ్రిని కలవాలనుకునే కూతురి తపన.. లాంటి భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ డిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించి మెప్పించారు.

bhola release date
భోళా రిలీజ్​ డేట్​

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'​ రిజల్ట్​పై ప్రభాస్​ కామెంట్స్​.. ఆ లేడీ డైరెక్టర్​తో రోషన్​ మూవీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.