ETV Bharat / entertainment

'అనిల్‌ రావిపూడితో పనిచేస్తే ఒత్తిడి ఉండదు' - devi sri prasad

అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన 'ఎఫ్‌3' సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను పంచుకున్నారు మ్యూజిక్​ డైరెక్టర్​ దేవీశ్రీ ప్రసాద్​.

devi sri prasad
దేవీశ్రీ ప్రసాద్
author img

By

Published : May 21, 2022, 6:43 AM IST

''జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించేవారో.. అలాంటి ఆరోగ్య కరమైన హాస్యం 'ఎఫ్‌3'లో ఉంద'' న్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటించిన చిత్రమే 'ఎఫ్‌3'.విజయవంతమైన సినిమా 'ఎఫ్‌2'కు సీక్వెల్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా మే 27న విడుదల కానున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

''ఎఫ్‌2'కు మించిన వినోదం 'ఎఫ్‌3'లో ఉంటుంది. దీన్ని అనిల్‌ రావిపూడి చాలా అద్భుతంగా రాశారు, తీశారు. ఆర్‌ఆర్‌ చేస్తూ.. నేను పడిపడి నవ్వుకున్నాను. ప్రేక్షకుల్ని నవ్వించాలని కంకణం కట్టుకొని సినిమా తీసినట్లుగా అనిపించింది. దీంట్లో వినోదంతో పాటు చక్కటి సందేశమూ ఉంది. దాన్ని అనిల్‌ చాలా గొప్పగా చెప్పారు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ ఇందులో చాలా అద్భుతంగా చేశారు. తమన్నా, మెహ్రీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, సునీల్‌, అలీ.. ఇలా అందరూ హిలేరియస్‌గా చేశారు''.

''అనిల్‌ రావిపూడితో పనిచేస్తే ఒత్తిడి ఉండదు. ఆయన స్క్రిప్ట్‌ చెప్పినప్పుడే సినిమా చూసినట్లు ఉంటుంది. 'ఎఫ్‌2'లో ఎక్కువ సిట్యుయేషనల్‌ సాంగ్స్‌ ఉంటాయి. ఇందులో జనరల్‌గా కనెక్ట్‌ అయ్యే పాటలూ చేశాం. 'లబ్‌ డబ్‌ డబ్బు', 'లైఫ్‌ అంటే ఇట్లా ఉండాలా' పాటలు కథలో భాగమవుతూనే అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. ఇవి ప్రేక్షకులకీ కొత్త అనుభూతిని పంచిచ్చాయి. రీరికార్డింగ్‌ అంతా చూసి.. 'అద్భుతంగా చేశారు. మీకు వంద హగ్గులు, వంద ముద్దులు' అన్నారు అనిల్‌ రావిపూడి. ఆ మాట నాకు చాలా ఆనందాన్నిచ్చింది''.

''నేనెప్పుడూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తూ చేస్తాను. ఒక ట్యూన్‌ కంపోజ్‌ చేసి, దీనికి నేను డ్యాన్స్‌ చేస్తానా? లేదా? అని చూసుకుంటాను. ట్యూన్‌ కంపోజ్‌ చేసినప్పుడే నాకు ఒక ఊపు వచ్చిందంటే అందరికీ ఆ జోష్‌ వస్తుందని నమ్ముతా. బహూశా అదే నా సీక్రెట్‌. ఇండస్ట్రీలో సంగీత దర్శకుల మధ్య పోటీ ఏమీ ఉండదు. మంచి పాటలు వచ్చినప్పుడు దాన్ని చూసి ప్రేరణ పొందుతాం. అలాంటి పాట మనమూ చేస్తే బావుంటుందనిపిస్తుంది. అంతే కానీ, మా మధ్య కాంపిటేషన్‌ ఏమీ ఉండదు''.

ఇదీ చదవండి: కేన్స్​లో దేవకన్య.. మతిపోగొట్టేస్తున్న బ్రెజిల్ మోడల్!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.