బాలీవుడ్ మాజీ దంపతులు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ఒకే పార్టీలో జంటలుగా సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సీనియర్ నటి పూజా బేడీ గోవాలో బుధవారం రాత్రి హోస్ట్ చేసిన ఈ పార్టీకి హృతిక్ రోషన్ తన రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ సబా అజాద్ హజరయ్యాడు. అలాగే సుసానే ఖాన్ తన రూమార్డ్ బాయ్‌ఫ్రెండ్ అర్స్లాన్ గోనితో పాల్గొంది. దీంతో మరోసారి ఈ మాజీ దంపతులు వార్తల్లో నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా బేడీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ షేర్ చేసింది. దీంతో ఈ పొటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి.
మంగళవారం రాత్రి.. ఈ రెండు జంటలు ముంబయి ఎయిర్ పోర్టులో.. విడివిడిగా మీడియా కంటపడ్డాయి. ఆ వీడియోల్లో హృతిక్ తన గర్ల్‌ఫ్రెండ్.. సబా అజాద్ చేతిలో చేయి వేసుకుని నడుచుకుంటూ కనిపించాడు. అలాగే సుసానే సైతం తన ప్రియుడు.. గోని చేతిలో చేయి వేసుకుని ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళుతూ కనిపించింది. ఈ మాజీ దంపతులు.. తమ కొత్త జంటలతో ఒకే పార్టీకి హాజరుకావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
కాగా ఈ పార్టీకి వీరితో పాటు ఫరా ఖాన్ అలీ, దర్శకుడు అభిషేక్ కపూర్‌లతో పాటు తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే.. కొంతకాలంగా హృతిక్.. సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీ-టౌన్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్స్‌పై ఈ జంట ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరు మంచి స్నేహితులే అంటూ హృతిక్ సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి.