ETV Bharat / entertainment

బోల్తా కొట్టిన డబ్బింగ్ సినిమాలు.. ఆ ఒక్కటి మినహా! - yash

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అరడజనుకు పైగా పెద్ద కథానాయకుల డబ్బింగ్‌ బొమ్మలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో ఒక్క 'కేజీఎఫ్‌2' మినహా మరే అనువాద చిత్రమూ బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటలేకపోయింది. అలాగని వచ్చినవన్నీ చిన్నచితకా చిత్రాలేమీ కావు. హీరో.. దర్శకుడు.. కాంబినేషన్‌.. ఇలా ఏదోక విషయంలో ప్రత్యేకత సంతరించుకున్నవే. అయినా వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి.

yash
kgf2
author img

By

Published : Apr 22, 2022, 7:05 AM IST

"సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమించినంతంగా మరెవరూ ప్రేమించలేరు. కథ బాగుంటే చాలు.. ప్రాంతీయ, భాషా భేదాల్లేకుండా ఆదరించి, ఆశీర్వదిస్తుంటారు".. ఇటీవల 'కేజీఎఫ్‌2' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా కథానాయకుడు యశ్‌ అన్న మాటలివి. ఆయనే కాదు.. సూర్య, విక్రమ్‌, కార్తి, ధనుష్‌ తదితర తమిళ హీరోలు సైతం తరచూ ముక్తకంఠంతో చెప్పే మాటలివే. ఇవేమీ ప్రేక్షకుల్ని ప్రసన్నం చేసుకోవడానికి అన్న పొగడ్తలైతే కావు. వాస్తవం కూడా. మన వాళ్లకి కథ బాగుంటే చాలు.. అది తెలుగు చిత్రమా? డబ్బింగ్‌ బొమ్మా? అని ఆలోచించరు. అందుకే ఏడాదికి దాదాపు వంద వరకు అనువాద చిత్రాలైనా తెలుగు తెరలపై సందడి చేస్తుంటాయి. కొవిడ్‌ పరిస్థితుల వల్ల కొన్నాళ్లుగా డబ్బింగ్‌ చిత్రాల జోరు తగ్గింది. ఇప్పుడు తెలుగు సినిమాలకు దీటుగా.. అనువాదాలు సైతం బాక్సాఫీస్‌ ముందు జోరు చూపిస్తున్నాయి. అయితే వీటిలో ప్రేక్షకుల మెప్పు పొంది.. బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటుతున్న చిత్రాలు మరీ అరుదైపోతున్నాయి.

అలా మెరిసి..ఇలా మాయమై

సాధారణంగా ఫిబ్రవరిలో తెలుగు నాట చిన్న చిత్రాల జోరు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఈసారి అనువాద చిత్రాల సందడి ఎక్కువైంది. ఈనెల తొలి వారంలోనే ‘సామాన్యుడు’గా ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు విశాల్‌. తు.ప.శరవణన్‌ తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. డింపుల్‌ హయాతి కథానాయికగా నటించింది. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్ని ఊరించిన ఈ సినిమా.. తెరపై ఏమాత్రం మెప్పించలేకపోయింది. ఆ మరుసటి వారమే ఓటీటీ వేదికగా ‘మహాన్‌’తో సినీప్రియుల ముందుకొచ్చారు కథానాయకుడు విక్రమ్‌. దీంట్లో ఆయన తనయుడు ధృవ్‌ విక్రమ్‌ మరో హీరోగా నటించారు. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకుడు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఆదరణే దక్కింది. అయితే విక్రమ్‌ గత చిత్రాలతో పోల్చితే.. ఇది చాలా మెరగన్న మాటలు సినీప్రియుల నుంచి వినిపించాయి. ముఖ్యంగా తన తండ్రీతో పోటీ పడుతూ ధృవ్‌ కనబర్చిన నటనకు విమర్శకుల నుంచీ ప్రశంసలు దక్కాయి. తమిళంలో వైవిధ్యభరిత కథలకు చిరునామాగా నిలిచే హీరో విష్ణు విశాల్‌. ఆయన నటించిన ‘ఎఫ్‌ఐఆర్‌’ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో సమర్పించారు కథానాయకుడు రవితేజ. దీంతో ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మను ఆనంద్‌ తెరకెక్కించిన ఈ సీరియస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ దక్కినా.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇక ఫిబ్రవరి నెలాఖరున ప్రేక్షకుల్ని పలకరించిన మరో పెద్ద అనువాద చిత్రం ‘వలీమై’. అజిత్‌ హీరోగా నటించిన ఈ సినిమాని హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు. ప్రచార చిత్రాలతోనే సినీప్రియుల్ని విశేషంగా అలరించిన ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌.. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ ముందు చేదు ఫలితాన్ని అందుకొంది. అయితే దీనికి తమిళ నాట చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు దక్కినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపించాయి.

జైత్రయాత్ర ఆగింది..

కొవిడ్‌ పరిస్థితుల వల్ల రెండేళ్లుగా ఓటీటీ బాటలోనే నడిచారు కథానాయకుడు సూర్య. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్‌’ సినిమాలతో ఓటీటీ వేదికగానే వరుస విజయాలు అందుకొన్నారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ‘ఈటి’ (ఎవరికీ తలవంచడు)తో తిరిగి వెండితెరపై మెరిశారు. పాండిరాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేపోయింది. దీంతో సూర్య జైత్రయాత్రకు బ్రేక్‌ పడినట్లయింది. ఈసారి విజయ్‌కు సైతం తెలుగు నాట ఎదురు దెబ్బే తగిలింది. ‘మాస్టర్‌’ వంటి హిట్‌ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా ‘బీస్ట్‌’. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ తెరకెక్కించారు. విడుదలకు ముందే ‘‘అరబిక్‌ కుతు’’ పాటతో విశేషమైన ప్రాచుర్యం పొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ ముందు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేకపోయింది. తమిళనాట సైతం ఈ చిత్రానికి చేదు ఫలితమే దక్కినట్లు సినీ విశ్లేషకుల నుంచి వార్తలు వచ్చాయి.

మూస ధోరణితోనే దెబ్బ

ఇటీవల కాలంలో విడుదలై జాతీయ స్థాయిలో ఆకట్టుకున్న ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘కేజీఎఫ్‌2’ చిత్రాల విజయాలకు కారణం.. ఆయా సినిమాల్లో ఉన్న కొత్తదనమే. ఆ కొత్తదనాన్ని అందిపుచ్చుకోవడంలో తమిళ అగ్ర కథానాయకులు తడబడుతున్నారనేది విమర్శకుల వాదన. అందుకే రజనీకాంత్‌, విక్రమ్‌ వంటి వారు కొన్నాళ్లుగా పరాజయాల బాటలో నడవాల్సి వస్తోంది. గతంతో పోల్చితే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. సినిమాలోని స్టార్‌ వాల్యూ కంటే కథ కథనాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందుకే మూస కథలతో ఎవరు ముందుకొచ్చినా.. మొహమాటం లేకుండా పక్కకు నెట్టేస్తున్నారు. ఈ మార్పుల్ని గమనిస్తేనే ఆ స్థాయి హిట్లకు, ప్రేక్షకాదరణకు అవకాశం ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఇదీ చూడండి: స్టంట్​మెన్ వేటలో ప్రభాస్.. చెర్రీ షూటింగ్ పూర్తి.. సమంత ట్రైలర్ అప్డేట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.