ETV Bharat / entertainment

'RRR' నిర్మాతతో పవర్ స్టార్ కొత్త ప్రాజెక్ట్​.. సాహో సుజిత్ డైరెక్షన్​లో.. - పవన్​ కల్యాణ్​ డీవీవీ మూవీ

ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్న పవన్​ కల్యాణ్​తో డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​ ఓ కొత్త ప్రాజెక్ట్​ అనౌన్స్​ చేసింది. ఈ క్రమంతో రిలీజైన ఓ పోస్టర్​ నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది.

pawan-kalyan-and-sujith-movie
pawan-kalyan-and-sujith-movie
author img

By

Published : Dec 4, 2022, 10:08 AM IST

హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్​ సింగ్ తర్వాత పవన్​ ​కల్యాణ్​ ఏ ప్రాజెక్ట్​ అనౌన్స్​ చేస్తారా అనే ఆసక్తి ఫ్యాన్స్​లో నెలకొంది. అయితే ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్​లో బిజీగా ఉన్న పవన్​ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్​ చేస్తున్నారు. అయితే డీవీవీ ఎంటర్​టైనమెంట్​ సంస్థ తాజాగా పవన్​కు సంబంధించిన ఓ నయా పోస్టర్​ను విడుదల చేసింది. సాహో డైరక్టర్​ సుజీత్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్​గా రవి చంద్రన్​ వ్యవహరిస్తున్నారు.​ 'ఆయన్ను ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్​స్టర్) అని పిలుస్తుంటారు' అనే క్యాప్షన్​తో రిలీజ్​ అయిన ఈ పోస్టర్​ ప్రస్తుతం​ నెట్టింట్లో హల్​చల్​ చేస్తోంది. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత డీవీవీ బ్యానర్​లో తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్​ అయినందున ఫ్యాన్స్​ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

pawan kalyan dvv poster
పోస్టర్​

వీరమల్లు షూటింగ్​ శరవేగం..
పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.