Dulquer salmaan surprise visit his fans: తమ అభిమాన కథానాయకుడు కనిపిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు. అదే చిన్నారులైతే ఎగిరి గంతేస్తారు. ఆనందంతో ఉబ్బి తబ్బిబవుతారు. అలాంటి సంతోషాన్నే కొందరు చిన్నారులకు అందించారు నటుడు దుల్కర్ సల్మాన్. తన పుట్టినరోజు సందర్భంగా కొందరు చిన్నారులను కలిసి వారితో కొద్దిసేపు గడిపారు. తనకు ఎప్పటి నుంచో వాళ్ల నుంచి లెటర్స్ వస్తున్నాయని, అక్కడకు వెళ్లటం ఉత్సాహంగా ఉందని చెప్పారు.
దుల్కర్‌ను చూడగానే చిన్నారులందరూ కరచాలనం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన కూడా ఎంతో ఆప్యాయంగా చిన్నారులందరినీ దగ్గరకు తీసుకున్నారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా దుల్కర్ గురించి ఓ చిన్నారి చెప్పిన డైలాగ్‌లకు పడి పడి నవ్వారు. ఆద్యంతం హృద్యంగా ఉన్న ఆ వీడియోను మీరూ చూసేయండి. ఇక దుల్కర్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతా రామం' ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: రామ్‌చరణ్‌కు హాలీవుడ్ ఆఫర్.. 'జేమ్స్‌బాండ్'గా ఛాన్స్!
'అవెంజర్స్' రేంజ్లో 'ప్రాజెక్ట్ కె'.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత