కథానాయకుడు బ్రాహ్మణుడు, కథానాయిక క్రిస్టియన్‌గా చూపించారు. భారతీరాజా ‘సీతాకోక చిలుక’ ప్రేరణ ఉందా ?
వివేక్ ఆత్రేయ: ‘సీతాకోక చిలుక’తో సంబంధం లేదు. కేవలం నవ్వించడమే కాదు, ఇందులో అన్నీ రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఐదేళ్ళ క్రితమే ఈ కథ ఐడియా వచ్చింది. మొదట విష్ణుతో షేర్ చేసుకున్నా. ఈ కథకి నాని అయితే బాగుంటుందని అప్పుడే అనుకున్నాం.
నాని లుక్ బారిష్టర్ పార్వతీశంని గుర్తిచేసింది. ఆ నవల ప్రేరణ ఉందా ?
వివేక్ ఆత్రేయ: నాకు చాలా ఇష్టమైన నవల బారిష్టర్ పార్వతీశం. ఈ కథలో ఒక చిన్న ఎపిసోడ్ లో దాని ప్రేరణ తీసుకొని పంచకట్టు, మిగతా సంరంజామా పెడితే బాగుంటుందనిపించి పెట్టాం. ఐతే దీనికి కథకి ఎలాంటి సంబంధం లేదు.
ఈ కథ విన్నతర్వాత నాని ఎలా స్పందించారు? సందేశం ఏదైనా ఉందా?
వివేక్ ఆత్రేయ: నాని చాలా ఉత్సాహం చూపారు. నిజాయితీ గల కథ. కథలో పాత్రలు కనిపిస్తాయి తప్పితే ప్రత్యేకమైన ఎలివేషన్స్ ఏమీ ఉండదు. సంప్రదాయవాద సమాజం అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్. దీని గురించి చర్చ ఉండదు. అయితే మనం ఎలాంటి సమాజం వైపు రావాలనే చిన్న సోషల్ కామెంట్ ఇందులో ఉంటుంది. పైగా ఇప్పటి వరకూ నాని ఇలాంటి పాత్ర చేయలేదు. కచ్చితంగా కొత్త నానిని చూస్తారు.
‘అంటే సుందరానికీ’లో అంటే ఏమిటో ఇంకా సస్పెన్స్‌లో పెట్టారెందుకు?
వివేక్ ఆత్రేయ: అవును. టీజర్, ట్రైలర్‌లో కథ ఎలా ఉండబోతుందో ఒక ఐడియా మాత్రమే ఇచ్చాం. సస్పెన్స్ అలానే కొనసాగుతుంది. ఆ అంటే ఏమిటో అనేదే ఇందులో కీలకం. అది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
రెండు మతాలకి సంబధించిన పాయింట్ టచ్ చేసినప్పుడు వివాదాలు వచ్చే అవకాశం ఉంది కదా! ఎలా డీల్ చేశారు ?
వివేక్ ఆత్రేయ: చాలా సున్నితమైన పాయింట్. అయితే, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా ఒకరు తక్కువ మరొకరు ఎక్కువ అని అని కాకుండా పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తీశాం. సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ ఇవ్వడమే దీనికి నిదర్శనం.
సినిమా రన్‌టైమ్ ఎక్కువగా అనిపిస్తోంది కదా!
వివేక్ ఆత్రేయ: రన్ టైం అనేది సమస్య కాదు. ఈ కథలో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు చెప్పడానికి నాకు కావాల్సిన సమయమే ఇది. మంచి కథ తీశామని సినిమా యూనిట్ అంతా చాలా నమ్మకంగా ఉన్నాం. సినిమా చూస్తున్నపుడు సాగదీసిన ఫీలింగ్ ఉండదు.
నాని, నజ్రియాలతో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
వివేక్ ఆత్రేయ: నాని ఎప్పుడూ ఒక స్టార్‌గా ప్రవర్తించలేదు. ఆయన సెట్‌లో ఉన్నంత సేపు సుందర్ లానే ఉండేవారు. అలా ఉన్నపుడు డైరెక్ట్ చేయడం చాలా ఈజీ. అలాగే నజ్రియా కూడా అంతే. లీలా థామస్ పాత్ర చేయడానికి బలమైన పెర్ఫార్మర్ కావాలి. అందుకు నజ్రియా కరెక్ట్ అని భావించాం. కథ విన్న తర్వాత ఆమె కూడా ఓకే అన్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో పని చేయడం గొప్ప అనుభూతి. సినిమాకి కావాల్సిన ప్రతిది సమకూర్చారు. నేను ఏదీ అడిగినా ఇచ్చారు.
ఓటీటీల ప్రభావం పెరిగింది కదా.. సినిమాకి కథ చేసి ప్రేక్షకులని థియేటర్లోకి రప్పించడం సవాల్ గా ఉందా ?
వివేక్ ఆత్రేయ: ఇప్పుడున్న పరిస్థితిలో కచ్చితంగా సవాలే. అయితే సినిమా థియేటర్‌లో అందరితో చూసి ఎంజాయ్ చేయడం గొప్ప అనుభూతి. అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నపుడు ప్రేక్షకులు థియేటర్లో చూసి ఆనందించాలని కోరుతున్నాను. ‘అంటే సుందరానికీ’లో బలమైన కంటెంట్ ఉంది. తప్పకుండా ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తారు.
ఇవీ చూడండి..