ETV Bharat / entertainment

రాజమౌళి స్కెచ్ వేస్తే అట్లుంటది.. RRR సక్సెస్ సీక్రెట్ లీక్!

'ఆర్​ఆర్​ఆర్​' సినిమా రిలీజ్​కు ముందు దర్శకుడు రాజమౌళి భారీ స్కెచ్​ వేసి సర్వే చేయించారట. వాటి ఫలితాల ఆధారంగా తదుపరి పనులను జక్కన్న పూర్తి చేశారట. అయితే అదే ఆర్​ఆర్​ఆర్​ సెక్సస్​ సీక్రెట్​ అని అభిమానులు అంటున్నారు. అసలు జక్కన్న చేయించిన సర్వే ఏంటబ్బా?

director rajamouli special survey in northern cities before RRR release

author img

By

Published : Mar 6, 2023, 9:27 AM IST

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన దృశ్య కావ్యం 'ఆర్ఆర్​ఆర్'​. రిలీజ్​ అయిన మొదటి రోజు నుంచే పాజిటివ్​ టాక్​ దక్కించుకున్న ఈ సినిమా బ్లాక్​బస్టర్​గా నిలిచింది. బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపింది. థియేటర్లలో రిలీజై ఏడాది కావొస్తున్నా.. ఈ చిత్రం క్రేజ్​ తగ్గలేదనే చెప్పాలి. విదేశాల్లో 'ఆర్​ఆర్​ఆర్'​కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే అమెరికాలోని ఓ థియేటర్​లో ఆర్​ఆర్​ఆర్ చిత్రాన్ని​ రీరిలీజ్​ చేయగా.. ఒక్క షోకు సంబంధించి 1647 టికెట్లు నిమిషాల్లో అమ్ముడుపోయాయి. తర్వాత షో టికెట్ల కోసం అభిమానులు ఎదురుచూశారు. అలా రిలీజైన ప్రతీచోట ఈ సినిమాకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రామ్​చరణ్​, ఎన్టీఆర్​ నటనకు ఫిదా అయిపోతున్నారు.

ఉత్తరాది నగరాల్లో స్పెషల్​ సర్వే!
డైరెక్టర్​ రాజమౌళి.. 'ఆర్​ఆర్​ఆర్' చిత్ర విడుదలకు ముందు ఉత్తరాది రాష్టాల్లో భారీ సర్వే చేయించారట. ఇన్నోవా కార్లలో అహ్మదాబాద్​, నాగ్​పుర్​, లఖ్​నవూ సిటీలకు వెళ్లి సర్వే చేపట్టారట. ఆ తర్వాతనే సినిమాకు సంబంధించిన పోస్టర్లు ముద్రించారట. తాజాగా ఈ విషయాన్ని బాలీవుడ్​ డైరెక్టర్​ ప్రభు దయాల్​ గుప్త.. ఓ ప్రముఖ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

"మా టీమ్​ ద్వారా రాజమౌళి ఓ వారం పాటు సర్వే చేయించారు. ఇన్నోవా కార్లలో వెళ్లి టైర్​-2 సిటీల్లో సర్వే చేశాం. అది కూడా ఏజ్​ గ్రూప్​ బట్టి. మీకు ఎన్టీఆర్​ తెలుసా?.. రామ్​చరణ్​ తెలుసా? రాజమౌళి తెలుసా? అన్న ప్రశ్నలు అడిగాం. రాజమౌళి తెలుసా? లేక బాహుబలి తెలుసా? అని కూడా ప్రశ్నించాం. ఎక్కువమంది బాహుబలి మాత్రమే తెలుసు అని సమాధానమిచ్చారు. అందుకే ఉత్తరాది రాష్ట్రాల్లో ఆర్ఆర్​ఆర్ చిత్రానికి సంబంధించిన​ అన్ని పోస్టర్ల​పై 'From The Director Of Bahubali' అని ఉంటుంది. అయితే ఈ సినిమాలో హిందీ నటీనటులు అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​ ఉన్నా.. వాళ్ల చిత్రాలు పోస్ట​ర్లపై పెద్దగా వేసి ప్రేక్షకుల్ని మోసం చేయలేము కదా!" అని దర్శకుడు ప్రభుదయాల్ గుప్త చెప్పుకొచ్చారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు.. ఆర్​ఆర్​ఆర్​ సక్సెస్​ సీక్రెట్​ ఇదేనేమోనని కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రీరిలీజ్​!
ఇకపోతే ఆర్​ఆర్​ఆర్​ చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరికొద్ది రోజుల్లో ఆస్కార్​ వేడుక జరగనున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రీరిలీజ్​ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

నాటు నాటుకు ఆస్కార్​ రానుందా?
ఆర్​ఆర్​ఆర్​ సినిమాలోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకుంది. మన దేశంతోపాటు విదేశాల్లోనూ ఈ పాటకు అనేక మంది అభిమానులు ఉన్నారు. ఎందరో సెలెబ్రిటీలు ఈ పాటకు చిందులేసి వీడియోలు పోస్ట్​ చేశారు. ఇటీవలే ఈ పాట ఆస్కార్​ నామినేషన్​ కూడా దక్కించుకుంది. ఈ పాటకు ఆస్కార్ అవార్డు​ రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.

ఆస్కార్​ వేదికపై తెలుగు కుర్రాళ్లు
ఆస్కార్​ వేదికపై తెలుగు సింగర్లు.. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వనున్నారు. గాయకులు రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ.. ఆ పాటను ఆలపించనున్నారు. అయితే, ఈ పాటకు అటు రామ్‌చరణ్‌, ఇటు ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చేయడం లేదు. రెండున్నర నిమిషాల పాటు సాగే ఈ ప్రదర్శనలో అమెరికన్‌ డ్యాన్సర్లు చిందేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన రిహార్సల్స్‌ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.