ETV Bharat / entertainment

ప్రభాస్​ X హృతిక్​.. ఎవరు గొప్ప?.. వైరల్​ అవుతున్న రాజమౌళి ఆన్సర్​ - ప్రభాస్​ కొత్త సినిమాలు

ప్రభాస్​-హృతిక్ రోషన్​ను పోలుస్తూ దర్శకధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్​ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయన ఏం అన్నారంటే..

Rajamouli Comments On Hrithik and Prabhas
Prabhas Raja Hrithik
author img

By

Published : Jan 3, 2023, 6:32 PM IST

తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రంతో ప్రభాస్​, రాజమౌళి క్రేజ్​ అంతర్జాతీయ స్థాయిలో పెరిగింది. అలానే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందులో ప్రభాస్‌, బాలీవుడ్​ స్టార్​ హృతిక్‌ రోషన్‌లను పోలుస్తూ రాజమౌళి మాట్లాడిన మాటలు మళ్లీ చక్కర్లు కొడతున్నాయి.

ప్రసుత్తం వైరలవుతోన్న ఈ వీడియో 2009లో ప్రభాస్‌ 'బిల్లా' సినిమా ఆడియో లాంచ్‌ సందర్భంగా తీసింది. దీంట్లో జక్కన్న మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట 'ధూమ్‌ 2' విడుదలైనప్పుడు ఆ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. కేవలం బాలీవుడ్‌ వాళ్లు మాత్రమే ఇంత గొప్ప క్వాలిటీ సినిమాలు ఎలా తీయగలుగుతున్నారని అనుకునేవాడిని. మన సౌత్​లో హృతిక్‌ రోషన్​ లాంటి నటులు లేరా అని అనుకున్నా.. కానీ ఇప్పుడు బిల్లా సాంగ్స్‌, పోస్టర్స్‌, ట్రైలర్‌ చూశాకా.. ఒక్కటే చెప్పగలను.. ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషన్‌ నథింగ్‌' అని వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఈ సందర్భంగా తెలుగు సినిమాను హాలీవుడ్‌ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా కృషి చేసిన మెహర్‌ రమేష్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా అని అప్పట్లో అన్నారు రాజమౌళి. మరి ఈ వీడియోను నెటిజన్లు ఇప్పుడెందుకు ట్రెండ్​ చేస్తున్నారో తెలీదు కానీ.. విపరీతంగా కామెంట్స్​ పెడుతున్నారు.

'ప్రభాస్‌ టాలెంట్‌ని రాజమౌళి అప్పుడే గుర్తించాడు', 'ప్రభాస్‌ ముందు ఏ హీరో అయినా నథింగే'.. అని కొందరు అంటుండగా.. కేవలం సినిమా మీద హైప్‌ తేవడానికే రాజమౌళి అప్పుడు ఇలా మాట్లాడి ఉంటారని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె, సలార్​ వంటి భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.