ETV Bharat / entertainment

'అవన్నీ రూమర్స్.. ప్రభాస్​ను అలాంటి పాత్రలోనే చూపిస్తా' - ప్రభాస్​ మారుతీ హీరోయిన్లు

Prabhas Maruthi Movie: దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారు. రాధేశ్యామ్ ప్రమోషన్స్​లో మారుతి సినిమా గురించి తొలిసారి ప్రభాస్ వెల్లడించారు. ఈ సినిమా కథతో పాటు హీరోయిన్లకు సంబంధించి చాలా రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శకుడు మారుతి క్లారిటీ ఇచ్చారు.

prabhas maruthi
prabhas maruthi
author img

By

Published : Jun 17, 2022, 9:12 AM IST

Prabhas Maruthi: ప్రస్తుతం పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్ లైనప్ ఫుల్ బిజీగా ఉంది. మరో రెండేళ్ల వరకు అతడి డేట్స్ సర్దుబాటు కావడం కష్టమే. పలు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్​. ఈ బిజీ షెడ్యూల్​లోనే దర్శకుడు మారుతితో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. రాధేశ్యామ్ ప్రమోషన్స్​లో మారుతితో సినిమా చేయబోతున్న విషయాన్ని వెల్లడించి అభిమానులను సర్​ప్రైజ్ చేశారు. ప్రభాస్- మారుతి సినిమాకు సంబంధించి పలు వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.

హారర్ కథాంశంతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు, ఈ క్యారెక్టర్స్ కోసం మాళవికా మోహనన్, శ్రీలీలతో పాటు మరో నాయికను ఎంపికచేశారని ఊహాగానాలు వినిపించాయి. వీటిపై ఇన్నాళ్లు సైలెంట్​గా ఉన్న దర్శకుడు మారుతి 'పక్కా కమర్షియల్' ప్రమోషన్స్​లో ప్రభాస్​తో సినిమాపై స్పష్టత నిచ్చారు. ఈ సినిమా కథ, హీరోయిన్ల విషయంలో వినిపిస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తెలిపారు. హీరోయిన్లు ఎవరిని ఫైనల్ చేయలేదని అన్నారు.

పర్సనల్​గా తాను ప్రభాస్ ఫ్యాన్​నని, అతడిని అమితంగా అభిమానిస్తానని మారుతి తెలిపారు. ఫ్యాన్స్ అందరిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రభాస్​తో పూర్తిస్థాయి కామెడీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. 'డార్లింగ్', 'బుజ్జిగాడు' నాటి ప్రభాస్​ను తన సినిమాలో చూస్తారని, ఆ సినిమాల్లో ప్రభాస్ ఎంత ఉత్సాహంగా కనిపించారో అంతే జోష్, యాక్టివ్ నెస్​ను తన సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాల్ని వెల్లడిస్తానని మారుతి అన్నారు.

డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. మారుతి దర్శకత్వం వహించిన 'పక్కా కమర్షియల్' సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గోపీచంద్, రాశీఖన్నా జంటగా నటించారు. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్​తో 'సలార్' సినిమా చేస్తున్నారు. అలాగే నాగ్​అశ్విన్ 'ప్రాజెక్ట్ కే'తో పాటు 'ఆదిపురుష్' సినిమాల్లోనూ నటిస్తున్నారు.

ఇవీ చదవండి: మహేశ్​, అల్లు అర్జున్ సినిమాలు అప్​డేట్స్​.. రంగంలోకి అప్పుడే!

'20 దేశాలు తిరిగా.. 6 వేల షోస్ చేశా.. కానీ జబర్దస్త్​కు వచ్చాక..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.