Dill Raju Press Meet : టాలీవుడ్లో సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడం ఓ ఆనవాయితిగా వస్తోంది. స్టార్ హీరోలు సంక్రాంతిని ఓ సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి పోటీ పడుతుంటాయి. అయితే 2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సీఫీస్ వద్ద తీవ్ర పోటీ నెలకొననుంది. గతంలో లేని ఎప్పుడూ విధంగా ఏకంగా ఐదు పెద్ద సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం', విక్టరీ వెంకటేశ్ 'సైంధవ్', రవితేజ 'ఈగల్', తేజ సజ్జ 'హనుమాన్', నాగార్జున అక్కినేని 'నా సామిరంగా' సినిమాలు సంక్రాంతి బరిలో ఉండనున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి పోటీపై ప్రముఖ నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు ప్రెస్మీట్లో మాట్లాడారు.
'సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల ప్రొడ్యూసర్లతో ఛాంబర్లో మీటింగ్ నిర్వహించాం. ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడం వల్ల థియేటర్లు అడ్జస్ట్ అవ్వడం కష్టం. అన్ని సినిమాలు సంక్రాంతికే వస్తే, ఎవరికీ సరైన న్యాయం జరగదు. ఈ విషయాన్ని నిర్మాతల దృష్టికి తీసుకెళ్లాం. గుంటూరు కారం ఇదివరకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన కారణంగా ఆ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. మిగిలిన వాళ్లలో ఎవరైనా సంక్రాంతి పోటీ నుంచి డ్రాప్ అయితే, వాళ్లకు కచ్చితంగా ఛాంబర్ నుంచి సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తాం. ఓ సీనియర్‌గా 'హనుమాన్' సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కూడా సలహా ఇచ్చా. అది పాటించడం లేకపోవడం వాళ్ల ఇష్టం. రేపో, ఎల్లుండో ప్రొడ్యూసర్ల నుంచి రిప్లై రావచ్చు. చూడాలి మరి ఎవరు తగ్గుతారో' అని దిల్‌రాజు అన్నారు.
లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ (బాల గాంధర్వం) సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న దిల్‌రాజు సంక్రాంతి పోటీ గురించి మాట్లాడారు. ఇక సంక్రాంతికి పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 'ఫ్యామిలీ స్టార్' సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నట్లు దిల్‌రాజు తెలిపారు. ఇక సినిమా రిలీజ్ డేట్లపై ఇండస్ట్రీ ఎవరికీ ఆంక్షలు విధించలేదని ఆయన పేర్కొన్నారు.
VFX వండర్స్, BGM థండర్స్- హాలీవుడ్ లెవెల్లో 'హనుమాన్' ట్రైలర్
'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో ఔట్- ట్రెండింగ్‌లో గుంటూరు కారం మెలోడీ