ETV Bharat / entertainment

'కాంతారా' కాన్సెప్ట్​తో వచ్చిన ఈ సినిమా తెలుసా?.. త్వరలోనే తెలుగులో! - kantara movie collections

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ ముందు సంచలనం సృష్టించిన సినిమా కాంతార. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇదే కాన్సెప్ట్​తో గతంలో కూడా కన్నడలో ఓ సినిమా వచ్చింది. ఇప్పుడా చిత్రాన్ని తెలుగులో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

Kantara pingara
కాంతారా కాన్సెప్ట్​తో పింగార
author img

By

Published : Oct 26, 2022, 9:41 PM IST

కన్నడ చిత్రాలు కేజీయఫ్​, చార్లీ 777, విక్రాంత్ రోణ సూపర్​హిట్ కావడం వల్ల అక్కడి చిత్రాలకు బాగా క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదలైన చిత్రం 'కాంతారా'. సగటు ప్రేక్షకులనే కాదు సెలబ్రిటీలను సైతం మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంటోంది. తొలుత కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సూపర్​హిట్​గా నిలిచింది. విడుదలైన ప్రతి చోట కూడా భారీ కలెక్షన్లను అందుకుంటోంది. కన్నడ నుంచి కేజీయఫ్​ తర్వాత మళ్లీ ఆ రేంజ్​లో హిట్​ అందుకుంది. నటునిగా, దర్శకునిగా రిషభ్​ శెట్టిని మరో మెట్టు ఎక్కించింది. సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో యాక్షన్ ఎంటర్​టైనర్​గా రూపొందిందీ చిత్రం. అయితే ఆచారాలతో పాటు కమర్షియల్ హంగులను అద్ది దర్శకుడు రిషభ్​ శెట్టి హిట్​ను అందుకున్నారు.

కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఇదే కాన్సెప్ట్​తో గతంలో కూడా కన్నడలో ఓ సినిమా వచ్చింది. ఆ చిత్రమే 'పింగారా'. ఈ మూవీని కన్నడ, తులు భాషల్లో రూపొందించారు. ఉత్తమ తుళు సినిమాగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడీ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్​. త్వరలోనే ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పుడు వచ్చిన కాంతారాతో పోలిస్తే ఇందులోనూ కన్నడ సంసృతీ, సాంప్రదాయాలకు పెద్దపీట వేశారు. కానీ కమర్షియల్ హంగులు ఉండవు. అట్టడుగు, బలహీన వర్గాల వారి పోరాటాల ఆధారంగా రూపొందిందీ చిత్రం. అయితే ఆ చిత్రానికి అప్పుడు అక్కడ అంతగా గుర్తింపు రాలేదట. మరి ఇప్పుడు తెలుగులో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇదీ చూడండి: నయన్‌-విఘ్నేశ్‌ సరోగసీ.. విచారణ కమిటీ నివేదికలో ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.