ETV Bharat / entertainment

Dhoni LGM movie review : ధోనీ ఫస్ట్​ మూవీ రివ్యూ.. యోగిబాబే కాపాడాలి! - ధోనీ ఎల్​జీఎమ్​ మూవీ ట్రైలర్​

dhoni lgm movie review : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్​ సీఎస్కే సారథి ధోనీ ప్రొడ్యూస్ చేసిన 'లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌'శ్(ఎల్​జీఎమ్​) రీసెంట్​గా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా రివ్యూలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Dhoni Debut film LGM opens To negative Reviews
Dhoni LGM movie review : యోగిబాబే ధోనీని ఆదుకోవాలి
author img

By

Published : Jul 30, 2023, 11:44 AM IST

dhoni lgm movie review : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, ఐపీఎల్​ సీఎస్కే సారథి ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన క్రికెట్​తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తమిళనాడులో అతడికి ఉన్న క్రేజ్​ మాత్రం మాటల్లో చెప్పలేం. మిగతా ప్రపంచానికి మహేంద్ర సింగ్ ధోనీగా అభిమానం సంపాదించుకుంటే.. తమిళ తంబీలకు మాత్రం తల, తలైవాగా వారి గుండెల్లో నిలిచిపోయాడు.

అయితే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్​బై చెప్పిన ధోనీ ఐపీఎల్ కెరీర్​ను కొనసాగిస్తూనే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్​గా ధోనీ ఎంటర్​టైన్మెంట్ ప్రొడక్షన్​ హౌస్​ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్​లో భాగంగా ఓ చిత్రాన్ని నిర్మించారు. మొదటి సినిమాగా 'లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌'శ్(ఎల్​జీఎమ్​) రూపొందించారు. తమిళ ఆడియెన్స్​ను ఫోకస్​ చేస్తూ.. తమిళ యాక్టర్స్​తోనే ఈ సినిమాను చేశారు.

ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్​, ట్రైలర్​ కూడా అభిమానుల్లో ఆసక్తిని నింపాయి. మరీ ముఖ్యంగా ధోనీ నిర్మాతగా వ్యవహరించడంతో సినిమాపై మరింత ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇటీవలే జులై 28న అక్కడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించిన రివ్యూలు సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది తంబీలకు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని ఆ రివ్యూల ద్వారా అర్థమవుతోంది. మిక్స్​డ్ టాక్ వచ్చిందట. స్టోరీ, స్క్రీన్​ప్లే యావరేజ్​గా అందంటూ సినీ ప్రియులు ట్వీట్లు చేస్తున్నారు. కేవలం సినిమాలో యోగిబాబు మార్క్​ కామెడీ పెర్​ఫార్మెన్సే అదిరిపోయిందని అంటున్నారు. అతని కోసం సినిమాకు వెళ్లొచ్చని చెబుతున్నారు.

దీంతో ఈ సినిమా లాంగ్​ రన్​ బాక్సాఫీస్​ కలెక్షన్స్ ఎంతొస్తాయో, పెట్టిన బడ్జెట్​ వస్తుందో లేదో అని అంతా మాట్లాడుకుంటున్నారు. యోగిబాబే.. సినిమాను ఆదుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో.. హరీశ్‌ కల్యాణ్‌, 'లవ్‌టుడే' ఫేమ్‌ ఇవానా హీరోహీరోయిన్లుగా నటించారు నదియా, యోగిబాబు, ఆర్‌.జె. విజయ్‌ తదితరులు ఇతర కీలక పాత్రలో నటించారు. అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారట. ఈ చిత్రానికి రమేశ్‌ తమిళమణి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఆగస్టు 4న రిలీజ్ చేయనున్నారు.

ఇదీ చూడండి :

LGM movie dhoni : ప్రభాస్​- ధోనీ- బన్నీ సినిమా.. ఆ ఊహే ఎంత బాగుందో?

రాంచీ రోడ్డుపై ధోనీ కారు రయ్ రయ్​.. పక్కన ఉంది ఆమెనేనా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.