తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించారు బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర. సానుకూల ఆలోచనలతో ఉండాలని, తప్పుడు వార్తలకు అవకాశం ఇవ్వొద్దంటూ తన అభిమానులకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. తన ట్విట్టర్ పేజీలో 42 సెకన్ల వీడియోను పోస్ట్ చేశారు 86 ఏళ్ల ధర్మేంద్ర. తన ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న వార్తలతో కాస్త బాధపడ్డానని, కానీ, తాను అనారోగ్యానికి గురి కాలేదని స్పష్టం చేశారు.
-
Friends, With Love to You All 💕. pic.twitter.com/o4mXJSBDyF
— Dharmendra Deol (@aapkadharam) June 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Friends, With Love to You All 💕. pic.twitter.com/o4mXJSBDyF
— Dharmendra Deol (@aapkadharam) June 6, 2022Friends, With Love to You All 💕. pic.twitter.com/o4mXJSBDyF
— Dharmendra Deol (@aapkadharam) June 6, 2022
"మిత్రులారా, సానుకూలంగా ఉండండి, సానుకూలంగా ఆలోచించండి. అప్పుడే జీవితం సానుకూలంగా ఉంటుంది. నేను మౌనంగా ఉన్నా.. కానీ అనారోగ్యంతో కాదు. పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. "
- ధర్మేంద్ర, బాలీవుడ్ దిగ్గజ నటుడు.
1969లో వచ్చిన తన సినిమా ఆయా సావన్ ఝూమ్ కేలోని బురా మత్ సునో లిరిక్స్‌ను సూచిస్తూ.. అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. 'ఒకరినినొకరు ప్రేమించుకుంటే.. ఒకరిపై ఒకరికి మంచి అభిప్రాయం ఉంటుంది. జీవితం అందంగా ఉంటుంది'అని పేర్కొన్నారు ధర్మేంద్ర.
అంతకుముందు ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించారు ఆయన కుమారులు సన్ని, బాబీ దేఓల్.'మా తండ్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. హుషారుగా పనులు చేసుకుంటున్నారు.' అని సన్ని దేఓల్ తెలిపారు. ముంబయిలోని తమ ఇంటిలోనే తన తండ్రి ఉన్నట్లు తెలిపారు బాబీ దేఓల్. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయటం బాధగా ఉందన్నారు.
ఇదీ చూడండి: సల్మాన్ ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు.. భద్రత కట్టుదిట్టం