Dhanush Hollywood movie trailer: కోలీవుడ్ ప్రముఖ హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రేమ్యాన్'. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు కోసం ఓ సర్ప్రైజ్ ఇచ్చింది మూవీటీమ్. ట్రైలర్‌ను విడుదల చేసింది. పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ఈ ట్రైలర్‌లో ధనుష్ ఓ సీన్‌లో తళుక్కున మెరిశారు. చాలా స్టైలిష్‌గా కనిపించారు.
'కెప్టెన్ అమెరికా', 'అవెంజర్స్' సిరీస్ తదితర చిత్రాలను అందించిన దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ధనుష్‌తో పాటు రియాన్ గోస్లింగ్, క్రిస్ ఎవాన్స్, అనా డి అర్మాస్, జెస్సికా హెన్విక్ తదితర హాలీవుడ్ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలకానుంది. 'నెట్‌ఫ్లిక్స్'లో జులై 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: కార్తి.. మూడు నెలల్లో మూడు సినిమాలు- ఆసక్తిగా 'థోర్' ట్రైలర్