Deepavali Release Dubbing Movies : ఇప్పటి కాలంలో ప్రతి సినిమా ఒకటి లేదా రెండు భాషల్లో విడుదలవుతూ సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి సినిమాలు కొన్ని సార్లు పాన్ ఇండియా లెవెల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఒక భాషలో హిట్ అయిన సినిమాలు డబ్బింగ్ రూపొంలో వచ్చేసరికి ఫలితాలు తారుమారు అవుతున్నాయి. కొన్ని సార్లు అనూహ్య విజయాలు సాధిస్తాయని అనుకున్న సినిమాలు కూడా మరో బాక్సాఫీస్ వద్ద డీలా పడుతుంటాయి. ఈ మధ్య విడుదలైన పలు సినిమాలతో ఈ విషయం స్పష్టమవుతోంది.
దీపావళి కానుకగా లారెన్స్ 'జిగర్ తండ డబుల్ ఎక్స్' మూవీ తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైంది. అయితే తమిళనాడులో ఈ సినిమా రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కానీ తెలుగులో మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేక కష్టపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇక కార్తి 'జపాన్' కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' మాత్రం ఈ రెండు సినిమాల కంటే మెరుగైన వసూళ్లను అందుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇలా వేరే భాష సినిమాలు తెలుగులో డీలా పడటం ఇదేం తొలిసారి కాదు. సెప్టెంబర్‌లో విడుదలైన విశాల్ 'మార్క్ ఆంటోనీ' కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమా అంతగా ఆడలేదు.
గతంలోనూ ఇలాంటివి మనం చాలానే చూశాం. 'పొన్నియిన్ సెల్వన్'కు వచ్చిన క్రేజ్‌ను చూస్తే ఇది కచ్చితంగా మంచి వసూళ్లను సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు అంతగా కనెక్ట్ కాలేదు. విజయ్ సేతుపతి లీడ్ రోల్లో తెరకెక్కిన 'విడుదల పార్ట్ 1' కూడా మంచి టాక్ అందుకున్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
ఒకప్పటి కాలంలో శంకర్, గౌతమ్ మేనన్, మణిరత్నం లాంటి దిగ్గజాల సినిమాలు తెలుగులో డబ్బింగ్ అవుతున్నాయంటే.. వాటికి మంచి రెస్పాన్స్ ఉండేది. తమిళంలో హిట్ అయినట్లే ఇతర భాషల్లోనూ మంచి టాక్ అందుకునేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయింది. పరిస్థితులు, అభిరుచులకు అనుగుణుంగా ఇప్పుడు సిినమాలను తెరకెక్కిస్తే కాని అనుకున్న ఫలితాలు రావట్లేదు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం స్ట్రాంగ్ కంటెంట్‌తో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్నాయి. అయితే పక్క రాష్ట్రంలో హిట్టు కొట్టిందని హక్కులు కొనుక్కుంటే.. తర్వాత బాక్సాఫీస్ వద్ద క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అయితే 'కేజియఫ్','కాంతార', 'విక్రమ్', 'లియో' లాంటి సినిమాలు ఇందుకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద సెన్షేషన్ క్రియేట్ చేశాయి. కానీ ప్రతిసారి ఇటువంటి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రమోషన్లు, పబ్లిసిటీ బాగునప్పటికీ కథ మన నేటివిటీకి దగ్గరగా ఉంటేనే ఇప్పుడున్న ఆడియెన్స్ చూస్తున్నారు. లేకుంటే.. ఎంత పెద్ద బ్యానర్‌పై తెరకెక్కినా సరే.. ఆ సినిమా ఫలితం తారుమారు అయిపోతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'జపాన్' సినిమా రివ్యూ - బంగారం దొంగగా కార్తి! మూవీ ఎలా ఉందంటే?
Jigarthanda Double X Teaser : ఊరమాస్‌గా జిగర్తాండ డబుల్ X టీజర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?