ETV Bharat / entertainment

మళ్లీ డబ్బింగ్ చిత్రాలదే డామినేషన్​.. రాబోయే పండక్కి ఏం రిలీజ్ కానున్నాయంటే? - దీపావళికి జిగర్తాండ డబుల్​ ఎక్స్​ఎల్​

Deepavali 2023 Movie Release : టాలీవుడ్​లో ఇప్పటికే తెలుగు చిత్రాలు రిలీజ్ అవ్వక వినాయక చివితి బాక్సాఫీస్ సీజన్ మిస్​ అయింది. ఇక రాబోయే దీపావళికి కూడా తెలుగు బాక్సాఫీస్ ముందు అన్నీ డబ్బింగ్ చిత్రాల హవానే కనిపించేలా ఉంది. ఆ వివరాలు..

Deepavali 2023 Movie Release : మళ్లీ డబ్బింగ్ చిత్రాలదే డామినేషన్​.. ఈ సారి ఏం రిలీజ్ కానున్నాయంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 8:28 AM IST

Deepavali 2023 Movie Release : టాలీవుడ్​లో పండగ సీజన్ అంటే.. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు అందరూ క్యూ కట్టేస్తారు. తమ చిత్రాలతో అటు అభిమానుల్ని, ఇటు ప్రేక్షకుల్ని అలరించేందుకురెడీ అయిపోతుంటారు. పైసా వసూలు చేసుకుని వెళ్లిపోతుంటారు. అయితే ఎందుకో మరి ఈ సారి రెండు పండగ సీజన్లను, అలానే లాంగ్ వీకెండ్లను మిస్​ చేసేశారు మన దర్శకనిర్మాతలు.

ఇటీవలే వినాయక చవితి వచ్చింది. కానీ ఒక్క సరైన తెలుగు చిత్రం కూడా ఈ పండగ బరిలో దిగలేదు. కేవలం డబ్బింగ్ చిత్రాలే వచ్చాయి. కోలీవుడ్ స్టార్​ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ బాక్సాఫీస్ ముందుకు వచ్చింది. అయితే అది తమిళంలోనే మంచి టాక్ దక్కించుకుంది. కానీ తెలుగులో అంతగా రాణించలేకపోయింది. దీంతో తెలుగు చిత్రసీమకు గణేశుడి సెలవులు వృథా అయిపోయాయనే చెప్పాలి.

అయితే తర్వాత రాబోయే దసరా మాత్రం అలా లేదు. ప్రేక్షకుల్ని అలరించేందుకు బాలకృష్ణ భగవంత్ కేసరి, మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు రెడీ అయిపోతున్నాయి. కాబట్టి నో టెన్షన్​. బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాల సందడి ఉంటుంది. కానీ దీపావళికే మళ్లీ సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. టాపసుల పండగకు డబ్బింగ్ జాతరే కనిపించే అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 10న టాలీవుడ్ నుంచి కేవలం మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ'(Adikesava Release Date) ఒక్కటే రిలీజ్ కానుంది. కానీ అప్పుడే కార్తీ జపాన్, లారెన్స్-ఎస్​జే సూర్య కాంబో జిగర్తాండ డబుల్ ఎక్స్ఎల్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే చియాన్ విక్రమ్ - గౌతమ్ మేనన్ ధృవ నచ్చతీరం కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట.

ఇక హిందీ నుంచి సల్మాన్ ఖాన్ భారీ యాక్షన్ ఎంటర్​టైనర్​ టైగర్ 3(Tiger 3 Release Date 2023) కూడా దాదాపుగా అదే డేట్ ఖరారు చేసుకుంది. ఇప్పటికే పఠాన్, జవాన్ సినిమాలతో హిందీకి ఇక్కడ డిమాండ్ కాస్త పెరిగింది. ఈ చిత్రాలన్నింటి మధ్యలో ఆదికేశవ సక్సెస్​ ఫుల్​గా రన్ అవ్వడం అంత సులభం కాదు కానీ.. టాక్ బాగుంటే మాత్రం అద్భుతం జరిగిపోతది. మరి ఏం జరుగుతుందో..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Disha Patani Latest Photos : గ్లామర్ బాంబ్​.. దిమాక్​ ​ఖరాబ్​ చేసేసింది బాసూ..

Bigg Boss Telugu Season 7 Pallavi Prashanth : పల్లవి ప్రశాంత్​కు 26 ఎకరాలు, లగ్జరీ కార్లు, కోట్ల విలువ చేసే ఆస్తులు.. క్లారిటీ ఇచ్చిన అతని తండ్రి.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.