ETV Bharat / entertainment

త్వరలోనే రాహుల్​ రామకృష్ణ పెళ్లి.. అమ్మాయిని కిస్ చేస్తూ ఫొటో షేర్ - కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ వివాహం

Comedian Rahul Ramakrishna Marriage: కమెడియన్‌ రాహుల్‌ రామకృష్ణ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. త్వరలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్​మీడియా వేదికగా తెలిపారు. ఓ అమ్మాయిని ముద్దుపెట్టుకుంటున్న ఫొటోను షేర్​ చేశారు.

Comedian Rahul Ramakrishna Marriage
త్వరలోనే రాహుల్​ రామకృష్ణ పెళ్లి
author img

By

Published : May 8, 2022, 10:29 AM IST

Comedian Rahul Ramakrishna Marriage: కమెడియన్‌, సహాయనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్‌ రామకృష్ణ. 'అర్జున్‌రెడ్డి' చిత్రంతో ఫేమ్‌ సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ తాజాగా ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. త్వరలో తాను పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. తన జీవితభాగస్వామిని పరిచయం చేస్తూ ఆదివారం ట్విటర్‌ వేదికగా ఓ ఫొటో షేర్‌ చేశారు.

Comedian Rahul Ramakrishna Marriage
త్వరలోనే రాహుల్​ రామకృష్ణ పెళ్లి.. జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ ఫొటో షేర్​

"ఎట్టకేలకు, త్వరలో పెళ్లి చేసుకోనున్నాం" అని ఆయన పేర్కొన్నారు. అయితే తన జీవిత భాగస్వామికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఇక, ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కంగ్రాట్స్‌ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో రాహుల్‌ ఓ కీలకపాత్ర పోషించారు. త్వరలోనే ఆయన నటించిన 'విరాటపర్వం' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: ప్రభాస్​ 'ప్రాజెక్ట్​ కె'లో మరో బాలీవుడ్ హాట్​​ బ్యూటీ.. ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.