Cinematic Air Salute To Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'సలార్'. కేజీఎప్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 22న (Salaar Release Date) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇదిలా ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ వివిధ రకాలుగా ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా కెనడాలోని ప్రభాస్ అభిమానులు వినూత్న ప్రదర్శన చేశారు. హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్ సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సినిమా నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా 'ప్రభాస్‌కు ఫ్యాన్స్ సినిమాటిక్ ఎయిర్ సెల్యూట్' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది.
-
A cinematic air salute to #Prabhas by Canada Rebel Star Fans 🚁#SalaarCeaseFire in cinemas worldwide from December 22nd! 💥#PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/3C0AmwpN1Q
— Hombale Films (@hombalefilms) December 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A cinematic air salute to #Prabhas by Canada Rebel Star Fans 🚁#SalaarCeaseFire in cinemas worldwide from December 22nd! 💥#PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/3C0AmwpN1Q
— Hombale Films (@hombalefilms) December 15, 2023A cinematic air salute to #Prabhas by Canada Rebel Star Fans 🚁#SalaarCeaseFire in cinemas worldwide from December 22nd! 💥#PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms #HombaleMusic @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84… pic.twitter.com/3C0AmwpN1Q
— Hombale Films (@hombalefilms) December 15, 2023
ఆరు హెలికాప్టర్లు!
కెనడాలోని టొరొంటోలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆయనపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. విశాలమైన ఓ మైదానంలో ప్రభాస్ భారీ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆరు హెలికాప్టర్లను గాల్లో క్రమ పద్ధతిలో సెల్యూట్ చేస్తున్నట్లుగా ఉంచారు. ఈ సినిమాటిక్ సెల్యూట్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Salaar Trailer Release Date 2023 : మరోవైపు, ఇప్పటికే రిలీజ్ అయిన 'సలార్' ట్రైలర్, ఓ పాట ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. రెండు వారాల క్రితం విడుదలైన ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తెలుగు వెర్షన్‌కు యూట్యూబ్‌లో 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక సూరీడే సాంగ్‌ను దాదాపు 7 మిలియన్ల (తెలుగు వెర్షన్) మంది వీక్షించారు. క్రష్ణకాంత్ రాసిన ఈ లిరిక్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిచగా, హిరనీ ఇవాటురి పాడారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Salaar Cast : ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా మారే కథతో సలార్ తెరకెక్కించారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటు ప్రేక్షకులను మెప్పించింది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మించింది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్, సీనియర్ నటుడు జగపతి బాబు, టీనూ ఆనంద్, ఈశ్వరీరావు, పృథ్వీ రాజ్, తదితరులు నటిస్తున్నారు.
'సలార్' ప్రైజ్ హైక్- యూఎస్‌లో 25వేల టికెట్లు సోల్డ్- మల్టీప్లెక్స్‌లో ధర ఎంతంటే?
నా కెరీర్లో 'సలార్' లాంటి రోల్ చేయలేదు- దాని కోసం ఆరు నెలలు ఎదురుచూశా : ప్రభాస్