ETV Bharat / entertainment

కొమ్మా ఉయ్యాల, ఎఫ్​3 సాంగ్స్​ అప్డేట్స్​.. దూసుకెళ్తున్న ఆచార్య ట్రైలర్​ ​ - పూజా హెగ్డే

CINEMA UPDATES TODAY: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో ఆచార్య ట్రైలర్​, ఎఫ్​3, ఆర్​ఆర్​ఆర్​ సాంగ్స్​​ సహా పలు అప్డేట్లు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

CINEMA UPDATES TODAY
కొత్త సినిమా అప్డేట్స్​
author img

By

Published : Apr 15, 2022, 1:01 PM IST

CINEMA UPDATES TODAY: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్ చిత్రం​ రికార్డులు సృష్టిస్తోంది. కీరవాణి స్వరపరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల వ్యూస్​ను సాధిస్తున్నాయి. ఈ సినిమాలోని కొమ్మా ఉయ్యాల పాటకు ఫిదా అయ్యారు అభిమానులు. సినిమా విడుదల తర్వాత ఎక్కువగా ఈ పాట గురించే మాట్లాడుతున్నారు. సినిమా ప్రారంభంలో మల్లీ హమ్ చేసిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి ఆలపించింది. అయితే.. తాజాగా ఈ పాట వీడియో సాంగ్​ను శనివారం(ఏప్రిల్​ 16)న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్​ పోస్టర్​ను విడుదల చేశారు. ఈ పోస్టర్​లో ఎన్​టీఆర్​ కొమురం భీం గెటప్​లో మల్లీని భుజాలపై ఎత్తుకుని వెళుతున్న ఫొటో ఆకట్టుకుంటోంది.

'సెల్ఫిష్'​గా మారిపోయిన యువ హీరో: ప్రముఖ నిర్మాత దిల్​ రాజు కుటుంబంలో నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆశిష్​ రెడ్డి. ఈ యువ హీరో నటించిన రౌడీ బాయ్స్​ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు ఆశిష్​. ఈ యంగ్​ హీరో ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమయ్యాడు. సెల్ఫిష్​ పేరుతో సినిమాను ప్రకటిస్తూ పోస్టర్​ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఈ మూవీ షూటింగ్​ ప్రారంభోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్​ హీరో ధనుష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. క్లాప్​ కొట్టి షూటింగ్​ ప్రారంభించాడు. కిషి విశాల్​, దిల్​రాజు, మిక్కీ జే మేయర్​, సుకుమార్​ సహా పలువురు హాజరయ్యారు.

అశోకవనంలో అర్జున కళ్యాణం కొత్త రిలీజ్​ డేట్​: విద్యాసాగర్​ చింతా దర్శకత్వంలో విశ్వక్​ సేన్​ తదితరులు నటిస్తున్న సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్​.ఎన్​ ప్రసాద్​ సమర్పణలో, ఎస్​వీసీసీ డిజిటల్​ బ్యానర్​ పై నిర్మిస్తున్నారు. జయ్​ కృష్ణ సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాను తొలుత ఏప్రిల్​ 22న విడుదల చేయాలని నిర్ణయించింది చిత్రం బృందం. అనుకోని కారణాల వల్ల వాయిదా వేశారు. కొత్త రిలీజ్​ డేట్​పై శుక్రవారం(ఏప్రిల్​ 15న) సాయంత్రం 5 గంటలకు ప్రకటన చేయనున్నట్లు ఓ పోస్టర్​ వీడుదల చేశారు.

దూసుకుపోతున్న ఆచార్య ట్రైలర్​: మెగాస్టార్​ చిరంజీవి, మెగాపవర్​స్టార్​ రామ్​ చరణ్​ కాంబినేషన్​లో రూపొందుతున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్​ రెడ్డి, అవినాశ్​ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్​, పూజా హెగ్డే కథానాయికలుగా అలరించనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్​ను రిలీజ్​ చేశారు. చాలా తక్కువ సమయంలోనే దూసుకుపోతోంది ఈ ట్రైలర్​. రికార్డు స్థాయిలో లైక్స్​, వ్యూస్​ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే 1 మిలియన్​ లైక్స్​, 26 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి.

ఎఫ్​3లో పూజే హెగ్డే కన్ఫామ్​!: అనిల్​ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్​-వరుణ్​ తేజ్​ కాంబోలో వస్తున్న ఎఫ్​-3లోని ఓ ఐటెం సాంగ్​లో పూజా హెగ్డే నటించనుందని కొద్ది రోజులగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆ సినిమా నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వరక్రియేషన్స్​ ఇన్​స్టా పోస్ట్​ వైరల్​గా మారింది. ఎఫ్​3 సెట్​లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు? అంటూ ఓ పోస్ట్​ చేసింది. అందులో ఉంది పూజా హెగ్డేనేనని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. అయితే, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇదీ చూడండి: తెలుగు తెరపై విదేశీ భామల సందడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.