ETV Bharat / entertainment

'చోర్​బజార్'​.. ఆ నమ్మకాన్ని ఇచ్చింది: ఆకాశ్​ పూరి

author img

By

Published : Jun 26, 2022, 8:18 PM IST

Chorbazaar Success meet: 'చోర్​బజార్' సినిమా పాజిటివ్​ టాక్​ తెచ్చుకున్న నేపథ్యంలో సక్సెస్​మీట్​ను నిర్వహించింది మూవీటీమ్​. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ఆకాశ్​పూరి.. తన అనుభవాలను తెలిపారు. ఈ చిత్రంతో మాస్ హీరోగా మెప్పించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు తనకు ఇచ్చారని అన్నాడు.

akash puri chorbazaar
ఆకాశ్​పూరి చోర్​బజార్​

చోర్​బజార్​ సక్సెస్​ మీట్​

Chorbazaar Success meet: ఆకాశ్ పూరి, గెహన సిప్పీ జంటగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'చోర్ బజార్'. ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించిన ఈ చిత్రం సుమారు 550కుపైగా థియేటర్లలో విడుదలైంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'చోర్​బజార్​' చిత్రంతో మాస్ హీరోగా మెప్పించగలననే నమ్మకాన్ని ప్రేక్షకులు తనకు ఇచ్చారని ఆకాశ్ తెలిపాడు. తన గత చిత్రాల కంటే చోర్​బజార్​ ఎంతో పేరు తీసుకొస్తుందని, అందుకు కారణమైన ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్నాడు.

"ఈ చిత్రంతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాను. మాస్​ ఆడియెన్స్​ నుంచి మంచి పేరు వచ్చింది. సినిమా కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ఈ మూవీ ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చింది." అని ఆకాశ్ అన్నారు. "ఆకాశ్​, ప్రొడ్యూసర్​, టెక్నిషియన్స్​.. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్​. మళ్లీ కమర్షియల్​ సినిమాలు తీయాలనుకుంటున్నాను" అని దర్శకుడు జీవన్​రెడ్డి అన్నారు."దర్శకుడు జీవన్​కు స్పెషల్ థ్యాంక్స్​. నా తొలి సినిమా ఇదేనని గొప్పగా చెప్పుకుంటాను. జీవితాంతం జీవన్​కు గుర్తుపెట్టుకుంటాను. ఆకాశ్​కు నేను పెద్ద ఫ్యాన్​ను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. సురేందర్​ సాంగ్స్​ను బాగా రాశారు. ఈ సినిమా మరింత ఆదరిస్తారని భావిస్తున్నాను." అని జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్​ అన్నారు.

ఇదీ చూడండి: 'రంగమార్తాండ' రిలీజ్​కు ప్లాన్​.. 'పంచతంత్ర కథలు' సాంగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.