ETV Bharat / entertainment

పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ హీరోయిన్- వరుడు ఎవరో తెలుసా?

Chitra Shukla Marriage Date : టాలీవుడ్​ హీరోయిన్ చిత్ర శుక్ల పెళ్లి పీటలెక్కబోతోంది. తాను ప్రేమించిన వ్యక్తితో ఏడడుగులు వేయనుంది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2023, 10:16 PM IST

Chitra Shukla Marriage Date
Chitra Shukla Marriage Date

Chitra Shukla Marriage Date : టాలీవుడ్​ అందాల హీరోయిన్ చిత్ర శుక్ల పెళ్లిపీటలెక్కబోతోంది. ఓ పోలీస్​ అధికారితో ఏడడుగులు వేసేందుకు రెడీ అయింది. మరో రెండు రోజుల్లో వీరి వివాహం జరగనున్నందున వధూవరులిద్దరూ పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు చిత్ర శుక్ల సోషల్​ మీడియాలో పోస్ట్ చేసింది.

Chitra Shukla Wedding Photos : కొన్నాళ్లుగా చిత్ర శుక్ల వైభవ్ ఉపాధ్యాయ్​ అనే పోలీస్ అధికారితో ప్రేమాయణం సాగిస్తోంది. వైభవ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. తమ ప్రేమను మరో లెవెల్​కు తీసుకెళ్లడానికి వీరిద్దరూ డిసెంబరు 8న పెళ్లి వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర శుక్ల కాబోయే భర్తతో దిగిన ఫొటోలను సోషల్​​ మీడియాలో అభిమానులతో షేర్​ చేసుకుంది.

Chitra Shukla Movies List : మధ్యప్రదేశ్‌కి చెందిన చిత్రశుక్లా.. 2014లో 'ఛల్ భాగ్' అనే హిందీ మూవీతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాతో తర్వాత ఓ తమిళ్​ సినిమాలో చేసింది. అయితే ఈ రెండు సినిమాల్లో డ్యాన్సర్​గా తెరపై కనిపించింది. 2016లో వచ్చిన 'నేను శైలజ' సినిమాతో టాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది అందాల తార చిత్ర శుక్ల. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్​ చేసింది.

'మా అబ్బాయి' సినిమాతో పూర్తి స్థాయిలో హీరోయిన్​ అయ్యింది. ఆ తర్వాత ఈ అమ్మడుకు కన్నడలో ఓ స్పెషల్​ సాంగ్​లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత తెలుగు డైరెక్టర్ల కళ్లలో పడిన చిత్ర శుక్ల.. టాలీవుడ్​లో వరుస సినిమాలు చేసింది. 'రంగుల రాట్నం', 'సిల్లీ ఫెలోస్', 'తెల్లవారితే గురువారం', 'పక్క కామర్షియల్', 'ఉనికి' అనే తెలుగు సినిమాలు చేసి టాలీవుడ్​ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ ఏడాది విడుదలైన 'హంట్'​ సినిమాలోనూ ఈ అమ్మడు నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ సుందరి ఓ తమిళ్​ సినిమాలో చేస్తోంది.

సాయిపల్లవికి క్రేజీ ఆఫర్​- యశ్​ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

వరదల్లో చిక్కుకున్న హీరోలు ఆమిర్ ఖాన్, విష్ణు విశాల్- అతికష్టం మీద బయటపడ్డారిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.