ETV Bharat / entertainment

'ఆ విషయాన్ని మార్చాలనుకుంటున్నా.. నేను నమ్మే సిద్ధాంతం అదే' - image is larger than their life chiranjeevi

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీతో మెగాస్టార్​ చిరంజీవి సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుల విషయంలో సాధారణంగా ఉండే ఓ టాక్​ను తిరగరాయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

chiranjeevi Krishna Vamsi
chiranjeevi Krishna Vamsi
author img

By

Published : Dec 24, 2022, 8:27 PM IST

నటుల విషయంలో సాధారణంగా 'ఇమేజ్‌ ఈజ్‌ లార్జర్‌దేన్‌ దేర్‌ లైఫ్‌' అంటుంటారని, దాన్ని తాను తిరగరాయాలనుకుంటున్నానని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. తన విషయంలో 'పర్సనల్‌ లైఫ్‌ ఈజ్‌ లార్జర్‌దేన్‌ స్టార్‌డమ్‌' అనే విధంగా వ్యక్తిత్వాన్ని మలుచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

సామాజిక కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు చెప్పారు. ''నాకేంటి? నా కుటుంబానికేంటి?' అనే కోణంలోనే ఇంతకాలం ఆలోచించా. ఇక అది చాలు. నా కుటుంబ సభ్యులూ అత్యున్నత స్థానంలో ఉన్నారు. భగవంతుడు నేను అనుకున్నదాని కంటే ఎక్కువే ఇచ్చాడు. సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పటి వరకూ ఇచ్చింది చాలా తక్కువ. ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది. కీర్తి, సినిమా గ్లామర్‌ శాశ్వతం కాదు వ్యక్తిత్వమే శాశ్వతం అన్న దాన్ని నేను నమ్ముతా '' అని చిరంజీవి పేర్కొన్నారు.

chiranjeevi Krishna Vamsi
చిరంజీవి, కృష్ణ వంశీ

దర్శకుడు కృష్ణవంశీతో 'నేనొక నటుణ్ని' షాయరీ అనుభవాన్ని వివరిస్తూ చిరు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. రంగస్థల నటుడి జీవితం ఎలా ఉంటుందో చూపించే ఈ సినిమాలోని 'నేనొక నటుణ్ని' అనే షాయరీకి చిరంజీవి గళం అందించారు.

లక్ష్మీభూపాల రాసిన, ఇళయరాజా స్వరపరిచిన ఆ షాయరీ ఇటీవల విడుదలై, శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో చిరు.. కృష్ణవంశీతో ముచ్చటించారు. ''నేను మీతో కలిసి పని చేయకపోయినా మీ డైరెక్షన్‌ అంటే నాకు ఇష్టం. 'కృష్ణవంశీ.. మనల్ని కొత్తగా చూపిస్తారు' అని రామ్‌చరణ్‌కి చెప్పా (గోవిందుడు అందరివాడేలే సినిమాని ఉద్దేశిస్తూ..). అనుకున్న సబ్జెక్ట్‌ దొరికేంత వరకూ మీలాంటివారు ముందుకురారు. మీరు ముందడుగేస్తే చాలా కథలు లభిస్తాయి. మీ దృక్పథం మార్చుకుంటే మాలాంటి వారికి మీ దర్శకత్వంలో నటించే అవకాశం వస్తుంది'' అని చిరంజీవి.. కృష్ణవంశీకి సూచించారు.

హృదయాన్ని కదిలించింది..
షాయరీ, రంగమార్తాండ చిత్రం గురించి చిరంజీవి మాట్లాడుతూ.. ''ఈ షాయరీ చెప్పాలని దర్శకుడు నా వద్దకు వచ్చినపుడు నన్నంత పెద్దవాణ్ని చేయకండి' అని చెప్పాలనిపించింది. కానీ, నా సినిమాల్లోని దృశ్యాలతో చేసిన వీడియో చూశాక 'ఈ థీమ్‌ మనకు దగ్గరగానే ఉంది' అని అనిపించింది. ఇన్ని వైవిధ్యభరిత పాత్రలు నేను షోషించానా? అనే సందేహం కలిగింది. మొత్తంగా ఆ వీడియో నా నట ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ హృదయాన్ని కదిలించింది.

షాయరీ చెబుతున్నంత సేపు ఎందరో మహానటులు మదిలో మెదిలారు. చాలామంది నటులు గొప్పగా బతికి మలి దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 'నేనొక నటుణ్ని' లైన్స్ చూసినపుడు కీర్తికిరీటాలు శాశ్వతంకాదు అనే భావన కలిగింది. పూర్తిగా లీనమై షాయరీని చెప్పా. బ్రహ్మానందం ఈ సినిమాలో మనం ఎప్పుడూ చూడని విధంగా కనిపిస్తారు. ప్రకాశ్‌రాజ్‌ నట విశ్వరూపం చూపించబోతున్నారు'' అని చిరంజీవి వివరించారు. 'రంగమార్తాండ' వచ్చే ఏడాది విడుదలకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.