Chiranjeevi Mega 156 Vishwambhara Title Concept Video Anil Kumar Upadyayula : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. బింబిసార వంటి హిట్ తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ టైటిల్ కాన్సెప్ట్ గ్లింప్స్ బాగుందంటూ ఆడియెన్స్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. వీడియోలోని గ్రాఫిక్స్ విజువల్స్ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.
అయితే ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? అతని పేరే అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్గా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో పలు సినిమాలకు పని చేశారు. త్వరలోనే డైరెక్టర్గా మారి మెగా ఫోన్ కూడా పట్టుకోబోతున్నారని బయట కథనాలు వస్తున్నాయి.
అనిల్ కుమార్ - రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాతో పాటు 'రాధేశ్యామ్'కు కూడా పని చేశారు. 'రాధేశ్యామ్' చిత్రంలోని 'నీ రాతలే' సాంగ్కు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ చేశారు. ఇకపోతే త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ అక్కినేని హీరోగా ఓ భారీ సినిమా రాబోతుంది. ఈ చిత్రంతో అనిల్ కుమార్ దర్శకుడిగా గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుందట. ప్రస్తుతం మెగా 156 విశ్వంభర టైటిల్ కాన్సెప్ట్ చూసిన నెటిజన్లు, సినీప్రియులు అనిల్ కుమార్ వర్క్ చూస్తుంటే టాలీవుడ్లో మరో టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
-
Beyond the universe and beyond the celestial realms, comes a light of hope - 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫
— Anil Kumar (@AforAnilkumar) January 15, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Conceptualised by Anil Kumar Upadyaula#Mega156 is #Vishwambhara ❤️🔥
- https://t.co/XC3KJjoliY
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @venkystudios pic.twitter.com/t39KIr0yxf
">Beyond the universe and beyond the celestial realms, comes a light of hope - 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫
— Anil Kumar (@AforAnilkumar) January 15, 2024
Conceptualised by Anil Kumar Upadyaula#Mega156 is #Vishwambhara ❤️🔥
- https://t.co/XC3KJjoliY
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @venkystudios pic.twitter.com/t39KIr0yxfBeyond the universe and beyond the celestial realms, comes a light of hope - 𝗩𝗜𝗦𝗛𝗪𝗔𝗠𝗕𝗛𝗔𝗥𝗔 💫
— Anil Kumar (@AforAnilkumar) January 15, 2024
Conceptualised by Anil Kumar Upadyaula#Mega156 is #Vishwambhara ❤️🔥
- https://t.co/XC3KJjoliY
MEGASTAR @KChiruTweets @DirVassishta @mmkeeravaani @NaiduChota @venkystudios pic.twitter.com/t39KIr0yxf
-
#HappyBirthday 🎂🎉
— Nusrat Arfah (@NusratArfah) February 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
To @AforAnilkumar Garu😍
From Darling #Prabhas Fans ❤ pic.twitter.com/NeB7mdKI8j
">#HappyBirthday 🎂🎉
— Nusrat Arfah (@NusratArfah) February 22, 2023
To @AforAnilkumar Garu😍
From Darling #Prabhas Fans ❤ pic.twitter.com/NeB7mdKI8j#HappyBirthday 🎂🎉
— Nusrat Arfah (@NusratArfah) February 22, 2023
To @AforAnilkumar Garu😍
From Darling #Prabhas Fans ❤ pic.twitter.com/NeB7mdKI8j
'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్ గ్లింప్స్ - రిలీజ్ డేట్ ఇదే