ETV Bharat / entertainment

ఈ చిన్నారి గాంధీని గుర్తుపట్టారా.. ఇప్పుడు బాలీవుడ్​ 'ఛత్రపతి'! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిన్నప్పటి ఫొటో

ఈ ఫొటోలో గాంధీ వేషధారణ వేసుకున్న చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇతను టాలీవుడ్​ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. ఇంతకీ ఆయన ఎవరంటే ?

Etv Bharat
Etv Bharat
author img

By

Published : May 3, 2023, 2:15 PM IST

మన ఫేవరట్​ హీరో లేదా హీరోయిన్​ చిన్నప్పుడు ఎలా ఉండే వారు ఏం చేసేవారో అని ఉత్సుకత మనకు ఎప్పుడూ ఉంటుంది. వారి గురించి ఇంకా తెలుసుకోవాలని ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తూనే ఉంటాం. అలానే ఆ స్టార్స్​ కూడా అప్పుడప్పుడు తమ గురించి చెప్పడమో లేకుంటే తమకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఫొటోల రూపంలో షేర్ చేయడమో చేస్తుంటారు. ​అందుకే సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలు తెగ ట్రెండ్​ అవుతుంటాయి. అయితే ఇటీవలే ఓ స్టార్​ హీరో తన చిన్ననాటి ఫొటోను షేర్​ చేశారు. ఆయన చిన్నప్పడు మహాత్మ గాంధీ వేషంలో ఉన్న సమయంలో తీసిన ఫొటోను నెట్టింట్లో అప్​లోడ్​ చేశారు.

అయితే ఈ ఫొటోను చూసిన వెంటనే కచ్చితంగా ఆయన్ను గుర్తుపట్టడం కష్టమే అనుకోండి. ఓ ప్రముఖ నిర్మాత తనయడైన ఈ స్టార్​ హీరో.. ప్రస్తుతం హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. టాలీవుడ్​లో వరుసపెట్టి సినిమాల్లో నటించిన ఈ స్టార్​ హీరో త్వరలోనే బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే అక్కడ ఛత్రపతిగా పేరు తెచ్చుకున్నాడు! ఇప్పటికీ గుర్తుపట్టలేదా. ఇంతకీ మహాత్మ గాంధీ వేషంలో ఉన్న ఈ కుర్రోడు ఎవరంటే. ఆయనే మన టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్​.

Bellamkonda sai srinivas childhood photo
బెల్లంకొండ సాయి శ్రీనివాస్​

'అల్లుడు శ్రీను', 'జయ జానకీ నాయక','రాక్షసుడు', 'సీత' , 'సాక్ష్యం' లాంటి సినిమాల్లో నటించిన ఈ స్టార్​ హీరో జయాపజాలను లెక్కచేయకుండా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్​ సినిమా ఛత్రపతి రీమేక్​లో నటిస్తున్నారు. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్​లో ఈయనకు ఇది తొలి సినిమా అయినప్పటికీ తన తెలుగు సినిమాలు హిందీ వెర్షన్​లో చూసిన అభిమానులకు ఈయన సుపరిచితుడే. అంతేకాకుండా ఈయన నటించిన 'రాక్షసుడు','జయ జానకీ నాయక','సీత' లాంటి సినిమాలన్నీ హిందీ వెర్షన్​లో హిట్​ అయ్యి యూట్యూబ్​లో సంచలనాలు సృష్టించాయి.

కాగా, 2014లో రిలీజైన 'అల్లుడు శ్రీను' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. తన డ్యాన్సులు, ఫైట్లతో అటు క్లాస్​తో పాటు ఇటు మాస్ ఆడియన్స్​ను ఆకట్టుకున్నారు. 'జయ జానకి నాయక' సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్​ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. అయితే ఈయన నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్​ వద్ద మంచి వసూళ్లు సాధించలేకపోతున్నాయి. అయినప్పటికీ అభిమానుల్లో ఈయనకున్న క్రేజ్​ ఇంతకింత పెరుగుతూనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.