Chandramukhi 2 Trailer Telugu : రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన కొత్త చిత్రం 'చంద్రముఖి 2'. బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ కీలక పాత్ర పోషించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గతంలో నటించిన సూపర్‌హిట్ సినిమా 'చంద్రముఖి'కి ఇది సీక్వెల్‌గా రూపొందింది. సెప్టెంబరు 15న విడుదల కానుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడటం వల్ల.. మూవీటీమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రచారం చిత్రంలో హారర్ లేదు కానీ.. కామెడీ-యాక్షన్ సీన్స్‌ను చూపించారు. 'చంద్రముఖి' సినిమా ఎండింగ్లో భవనం నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు చూపించిన ఓ పెద్ద పామునే... మళ్లీ చూపిస్తూ చంద్రముఖి-2 ట్రైలర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత రాజు వెట్టయరాజా గురించి బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతూ.. ప్రస్తుతం కాలంలో ఉన్న రాఘవ లారెన్స్ ఫైటింగ్ సీక్వెన్‌తో చూపించారు. అనంతరం రాధికా శరత్ కుమార్ కుటుంబం చంద్రముఖి భవనంలో నివాసానికి వెళ్లడం, ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఉన్నట్టు చూపించడం వంటి సన్నివేశాలతో ట్రైలర్‌ను ముందుకు నడిపించారు.
స్టార్ కమెడియన్ వడివేలు తన మార్క్ కామెడీతో భయపడుతూనే కాస్త నవ్వించారు. 'అది జరిగి 17 ఏళ్లు అవుతోంది. ఇది కచ్చితంగా అదే' అంటూ ఆయన చంద్రముఖి గురించి ఎలివేషన్ ఇచ్చారు. చంద్రముఖిగా కంగనా రనౌత్‌ను కాసేపే చూపించారు. ఫ్లాష్‍బ్యాక్‍లో రాఘవా లారెన్స్‌ను వెట్టయరాజగా చూపిస్తూ యాక్షన్ సీన్స్‌తో ఎలివేషన్ ఇచ్చారు. అలాగే చంద్రముఖికి, వెట్టయరాజాకు మధ్య 200 ఏళ్ల నాటి పగ ఉన్నట్టు, మళ్లీ ఇప్పుడు 17ఏళ్ల తర్వాత మొదలైందంటూ ప్రచార చిత్రాన్ని ముగించారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది.
Chandramukhi 2 Release Date : మొత్తంగా ఈ ట్రైలర్ చంద్రముఖి సినిమాలానే కాస్త అనిపిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమాలో వడివేలు, రాధికా శరత్ కుమార్, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, రావురమేశ్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Chandramukhi : "చంద్రముఖి" సినిమా ఎలా పుట్టింది.. ఆసక్తికర విశేషాలు మీకోసం!
Chandramukhi 2 Song : 'చంద్రముఖి-2' నుంచి 'స్వాగతాంజలి'.. దేవకన్యలా కంగనా!