ETV Bharat / entertainment

దిగ్గజ నటుడు చంద్రమోహన్​కు కన్నీటి వీడ్కోలు - చంద్రమోహన తెలుగు సినిమాల జాబితా

Chandra Mohan Funeral : టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ ప్రస్థానం ముగిసింది. సోమవారం మధ్యాహ్నం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, సినీ అభిమానులు అశ్రునయనాలు మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు.

Chandra Mohan Funeral
Chandra Mohan Funeral
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 1:31 PM IST

Updated : Nov 13, 2023, 1:56 PM IST

Chandra Mohan Funeral : తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు చంద్రమోహన్​ (82) ప్రస్థానం ముగిసింది. చంద్రమోహన్ పార్థివదేహానికి ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్​, పంజాగుట్ట శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.

చంద్రమోహన్​ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. అనంతరం ఆయన పార్థివ దేహాన్ని ఫిల్మ్​నగర్​లోని నివాసంలో ఉంచారు. చంద్రమోహన్​ మృతి పట్ల యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Chandra Mohan Telugu Movies List : కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్‌ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్‌ రావు. 1966లో 'రంగుల రాట్నం' సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన 6 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్​లో 600కిపైగా చిత్రాల్లో నటించి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు.తెలుగుతో పాటు పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. కెరీర్ తొలుత హీరో క్యారెక్టర్లు చేసిన ఆయన.. ఆ తర్వాత కమెడియన్​గా క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా తన విలక్షణ నటనతో అందరినీ అబ్బురపరిచారు. 'బంగారు పిచుక', 'ఆత్మీయులు', 'తల్లిదండ్రులు', 'బొమ్మబొరుసు', 'సీతామాలక్ష్మి', 'శంకరాభరణం','తాయారమ్మ బంగారయ్య','ఇంటింటి రామాయణం', 'కొరికలే గుర్రాలైతే', 'మంగళ తోరణాలు' 'కొత్తనీరు', 'సంతోషిమాత వ్రతం', 'మూడు ముళ్లు', 'చంటబ్బాయ్‌', 'శ్రీ షిరిడీ సాయిబాబా మహాత్యం','వివాహ భోజనంబు', 'త్రినేత్రుడు', 'యోగి వేమన', 'ఆదిత్య 369', 'పెద్దరికం', 'గులాబీ', 'రాముడొచ్చాడు','నిన్నే పెళ్లాడతా', 'ప్రేమించుకుందాం రా', 'చంద్రలేఖ', 'అందరూ హీరోలే' లాంటి సినిమాల్లో నటించారు.సీనియర్​ నటీనటులతోనే కాకుండా యంగ్​ స్టార్స్​తోనూ చంద్రమోహన్​ స్క్రీన్​ షేర్​ చేసుకున్నారు. తన కెరీర్​లో ఆయన రెండు ఫిలింఫేర్‌, ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 'పదహారేళ్ల వయసు', 'సిరి సిరి మువ్వ' సినిమాల్లో ఆయన నటనకుగాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 2005లో 'అతనొక్కడే' సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. 1987లో 'చందమామ రావే' సినిమాకు ఉత్తమ కమెడీయన్‌గా నంది అవార్డు అందుకున్నారు.

చంద్రమోహన్ - 800 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!

చంద్రమోహన్​ భార్య ఎవరు - పిల్లలు సినిమాల్లోకి ఎందుకు రాలేదో తెలుసా?

Last Updated : Nov 13, 2023, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.