ETV Bharat / entertainment

'సైరాట్​' నటుడిపై చీటింగ్​ కేసు.. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం! - సైరాట్ నటుడు సూరజ్​ పవార్​పై చీటింగ్ కేసు

దేశవ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'సైరాట్​' మూవీలో ప్రిన్స్​ దాదా పాత్రలో మెప్పించిన సూరజ్​ పవార్​పై చీటింగ్​ కేసు నమోదైంది. త్వరలో అతడిని విచారించనున్నట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.

sairat fame actor suraj pawar
case filed against sairat fame actor suraj pawar in ahmednagar
author img

By

Published : Sep 16, 2022, 9:42 AM IST

Updated : Sep 16, 2022, 9:57 AM IST

'సైరాట్'​ చిత్రంలో ప్రిన్స్ దాదా పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సూరజ్ పవార్​పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా అతడిని విచారించనున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
ఇదీ జరిగింది.. నిరుద్యోగులకు మహారాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ముగ్గురు నిందితులను అహ్మదానగర్ పోలీసులు సెప్టెంబర్ 9వ అరెస్టు చేశారు. నిందితులు సచివాలయం ఫేక్​ ఆర్డర్లు తయారు చేశారని.. దాడులు చేసి వారిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడులు చేసినప్పుడు మూడు ఫోర్జరీ చేసిన జాయినింగ్ ఆర్డర్లు, స్టాంపులు, సీల్​లు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.

sairat fame actor suraj pawar case
సైరాట్ సినిమా

అయితే విచారణలో భాగంగా నిందితులు.. తాము నకిలీ స్టాంపులు, సీల్​లు తయారు చేయాడానికి సూరజ్​ పవార్​ సహాయం చేశాడని చెప్పారని పోలీసులు తెలిపారు. సినిమా కోసం స్టాంపులు కావాలని.. నిందితులు వాటిని తయారు చేయించుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే దొరికిన సాక్ష్యాల ఆధారంగా.. సూరజ్​ పవార్ ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు.

sairat fame actor suraj pawar case
నిందితులను తీసుకెళ్తున్న పోలీసులు

"బాధితుడికి ఉద్యోగం ఇప్పిస్తామని వారి దగ్గర నుంచి నిందితులు రూ.5 లక్షల డిమాండ్​ చేశారు. బాధితుడు ముందుగా రెండు లక్షలు ఇచ్చాడు.. మరో మూడు లక్షలు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పాడు" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. సూరజ్ పవార్ నటించిన 'సైరాట్'​ సినిమా భారీ విజయం సాధించింది. దీంతో ​అతడికి మంచి గుర్తింపు లభించింది. ఇదే కాకుండా "పిస్తుల్యా","ఫ్యాండ్రీ" అనే లఘు చిత్రాలలో కూడా సూరజ్​ నటించాడు.

ఇవీ చదవండి : అతిపెద్ద యాక్షన్‌ మూవీగా 'ప్రాజెక్ట్ కె'.. రంగంలోకి హాలీవుడ్‌ డైరెక్టర్లు

రూ.200కోట్ల కేసు.. బాలీవుడ్​ స్టార్​ నటిపై 6 గంటలు ప్రశ్నల వర్షం

Last Updated : Sep 16, 2022, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.