ETV Bharat / entertainment

బ్రహ్మాస్త్రం అడ్వాన్స్​ బుకింగ్స్​కు పాజిటివ్​ రెస్పాన్స్.. బాలీవుడ్​ను ఆదుకుంటుందా - రణ్​బీర్ ​ బ్రహ్మాస్త్రం అడ్వాన్స్​ బుకింగ్స్​

రణ్​బీర్​ బ్రహ్మాస్త్రంకు బాయ్​కాట్​ సెగ అంతలా తగలేటట్టు కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్​కు పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తుందని ప్రముఖ సినీవిశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్​ ట్వీట్​ చేశారు. మరోవైపు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ప్రోమో విడుదలై ఆకట్టుకుంటోంది.

Bramhastra Advance booking
బ్రహ్మాస్త్రం అడ్వాన్స్​ బుకింగ్స్​
author img

By

Published : Sep 3, 2022, 6:01 PM IST

బాలీవుడ్ పరిస్థితి కొంతకాలంగా మారిపోయిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సరైన హిట్​ లేక విలవిలలాడుతోంది. ఓ వైపు వరుస ఫ్లాప్​లు, మరోవైపు బాయ్​కాట్​ సెగ.. బీటౌన్​కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే భయాలన్నింటికీ రణ్​బీర్​ 'బ్రహ్మాస్త్ర' చెక్ పెట్టేలా కనిపిస్తోంది. హిందీలో ఈ ఏడాది విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్', 'భూల్ బులయ్యా 2', 'గంగూబాయి కతియవాడి' మినహా మిగతా సినిమాలు భారీ విజయాలు సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్​గా నిలిచాయి. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', 'బచ్చన్ పాండే', ర‌ణ్‌బీర్‌ కపూర్ 'షంషేరా', విజయ్ దేవరకొండ 'లైగర్' వంటి సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలన్నింటికీ బాయ్‌కాట్‌ ట్రెండ్ సెగ తగిలింది. ఇటువంటి సమయంలో 'బ్రహ్మస్త్ర' అడ్వాన్స్ బుకింగ్ బాలీవుడ్‌కు ఊపిరి పోసేలా ఉంది.

అడ్వాన్స్​ టికెట్స్​ బుకింగ్స్​ బాగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 9 శుక్రవారం 63, శనివారం 25, ఆదివారం 12శాతం బుక్​ అయ్యాయని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. విడుదల రోజున టాక్ ఆధారంగా వీకెండ్ బుకింగ్స్ పెరిగే అవకాశముందని చెప్పారు. కాబట్టి ఈ సినిమాపై బాయ్ కాట్ ఎఫెక్ట్ పెద్దగా లేదని చెప్పారాయన. అలాగే ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు కాస్త ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. తెలంగాణలోని హైదరాబాద్, కర్ణాటకలోని బెంగళూరు వంటి నగరాల్లో కూడా 'బ్రహ్మాస్త్ర' బుకింగ్స్ బాగానే జరిగాయని చెప్పారు.

ప్రోమో సూపర్​.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్​, పోస్టర్స్​ విడుదలై ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ప్రీ రిలీజ్‌ ప్రోమో రిలీజై కూడా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో.. ట్రైలర్‌లో లేనివి, సినిమాలో కీలకంగా నిలిచే కొన్ని సీన్స్‌ని ఇందులో చూడొచ్చు. కాగా, రణ్‌బీర్‌ కపూర్‌ అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఇతిహాసాల ఆధారంగా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించారు. నరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, బ్రహ్మాస్త్రాలకు సంబంధించి పురాణ గాథలు, వాటి శక్తిని గురించి తెలియజేయనున్నారు. సెప్టెంబరు 9న విడుదలకానున్న ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం 'బ్రహ్మాస్త్రం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. 2డీ, 3డీ, ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుందని చిత్ర బృందం తెలిపింది.

ఇదీ చూడండి: దాదా ఎంత పని చేశావ్​.. మెగా బ్లాక్​ బస్టర్​ ట్రైలర్ సీక్రెట్​ తెలిసిపోయిందిగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.