'ఆర్ఆర్ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'ఎన్టీఆర్ 30' అనే వర్కింగ్ టైటిల్‌తో రీసెంట్గా షూటింగ్ ప్రారంభించుకుంది ఈ పాన్ ఇండియా మూవీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ లైన్ కూడా లీకవ్వడం వల్ల చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తన చివరి చిత్రం 'ఆచార్య' డిజాస్టర్‌తో గ్యాప్ తీసుకున్న కొరటాల.. ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిత్రాన్ని విజువల్ వండర్‌గానూ రూపొందించనున్నారట. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నిషియన్స్‌ను రంగంలోకి దించారు కొరటాల.
'జస్టిస్ లీగ్','ఆక్వా మాన్', 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' లాంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ బ్రాడ్ మినించ్ను ఈ సినిమాకు ఎంపిక చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలకు బ్రాడ్ మినించే పర్యవేక్షణ వహించనున్నారట. మరోవైపు ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది. 'ట్రాన్స్‌ఫార్మర్స్','మిషన్ ఇంపాజిబుల్','రాంబో 3' లాంటి హాలీవుడ్ సినిమాలతో పాటు ప్రభాస్ 'సాహో' సినిమాకు ఈయనే స్టంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
స్టోరీ లీక్.. మృగాలను భయపట్టే మగాడు.. 'ఎన్టీఆర్ 30' సినిమా పూజా కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ.. హీరో క్యారెక్టర్‌తో పాటు స్టోరీలైన్‌ను క్లుప్తంగా వివరించారు. ఈ సినిమాలో మృగాలు లాంటి మనుషులను భయపెట్టే మగాడిలా ఎన్టీఆర్ కనిపించనున్నారని తెలిపారు. దీంతో.. గతంలో 'జనతా గ్యారేజ్'తో ఎన్టీఆర్ సినీ కెరీర్‌కు ఓ బ్లాక్బాస్టర్ హిట్‌ను అందించిన కొరటాల.. ఈసారి సాలిడ్ హిట్‌ను అందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ తార జాన్వీ కపూర్ నటిస్తోంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరూధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
సెట్స్‌లో రత్నవేలు అనిరుథ్ సందడి.. తాజాగా ఎన్టీఆర్ 30 లొకేషన్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కలిసి సందడి చేశారు. ఆ సమయంలో తీసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. విదేశీ స్టంట్ మాస్టర్లు, హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ టీమ్ ఇలా ఎన్నో అంశాలతో పాటు సినిమా పోస్టర్లు.. ఈ మూవీపై అభిమానుల్లో మరింత హై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచుతున్నాయి. చూడాలి మరి కొరటాల ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారో.