ETV Bharat / entertainment

కెరీర్​లో​ ఒకే ఒక్క హిట్- కానీ రూ.300కోట్ల బాలయ్య సినిమాలో ఛాన్స్- ఎవరో తెలుసా? - బాలయ్య సినిమా 109

Bollywood Actress In Balakrishna Movie : 19ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ భామ. వరుస ఫ్లాపులు వెంటాడినా ఒకే ఒక్క హిట్ సినిమాతో రూ.300 కోట్ల పాన్​ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. బాలయ్యతో ఆడిపాడనుంది. ఇంతకీ ఆ భామ ఎవరంటే?

Bollywood Actress In Balakrishna Movie
Bollywood Actress In Balakrishna Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 6:29 PM IST

Updated : Dec 16, 2023, 6:34 PM IST

Bollywood Actress In Balakrishna Movie : సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య వయసులో చాలా పెద్ద అంతరం ఉంటుంది. తమకంటే వయసులో 20 నుంచి 30 ఏళ్ల పెద్దవారి పక్కన హీరోయిన్‎గా నటించాల్సి రావచ్చు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలు సైతం కుర్ర హీరోయిన్లనే కోరుకుంటున్నారట. దీంతో చాలామంది కుర్ర భామలు చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు.

ఇదేవిధంగా ప్రముఖ హీరో సన్నీ దేవోల్ పక్కన తన తొలి చిత్రంలో నటించిన 19 ఏళ్ల అందాల భామ వరుస ఫ్లాప్​లు వెంటాయి. ఆమెకు అదృష్టం కలిసి రాలేదని సినిమాల్లో హీరోయిన్‎గా ఛాన్సులు కూడా తగ్గాయి. కానీ తాజాగా ఆమె దక్షిణ భారతదేశంలో నిర్మిస్తున్న ఓ పాన్​ ఇండియా సినిమాలో ఛాన్స్ కొట్టేయడంతో వార్తల్లో నిలిచింది. తన ఫాష్యన్​తో సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా. తాజాగా ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసింది.

కెరీర్​లో ఒక్క హిట్​!
2013లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊర్వశి కెరీర్​లో ఒకే ఒక్క హిట్ ఉంది. తను నటించిన తొలి చిత్రం నుంచి ఇప్పటివరకు అన్నీ ప్లాప్ చిత్రాలే కానీ, సీనియర్ హీరో పక్కన నటించే సత్తా ఉన్న నటిగా గుర్తింపు ఉండటంతో రూ.300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది ఊర్వశి.

15 ఏళ్ల వయసులో తన ఫ్యాషన్ జర్నీని ప్రారంభించిన ఊర్వశి మిస్ టీన్ ఇండియాగా 2009లో ఎంపికైంది. లాక్మే ఫ్యాషన్ వీక్, అమెజాన్ ఫ్యాషన్ వీక్, బాంబే ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ వీక్​లకు షోస్ టాపర్​గా ర్యాంప్ వాక్ చేసింది. బ్యూటీ క్వీన్, ఇండియన్ ప్రిన్సెస్ 2011, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011 వంటి టైటిల్స్ గెలుచుకుంది. 2013లో సన్నీ దేవోల్​ పక్కన సింగ్ సాహిబ్ ది గ్రేట్ చిత్రంలో నటించడం ద్వారా తెరగేట్రం చేసిన ఊర్వశి నటిగా ఎక్కువ ప్లాప్ చిత్రాలతో చెత్త రికార్డు మూటగట్టుకుంది. కానీ, హనీసింగ్ మ్యూజిక్ ఆల్బమ్ లవ్ డోస్​లో తన డ్యాన్స్ ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది.

ఎన్​బీకే 109లో ఛాన్స్!
NBK 109 Heroine Name : సౌత్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఎన్​బీకే 109లో ఊర్వశికి ఛాన్స్ లభించిందని బాలీవుడ్ సమాచారం. 300 కోట్ల రూపాయల పాన్ ఇండియా సినిమాలో మెయిన్ హీరోయిన్‎గా నటించనుంది ఊర్వశి. ఈ చిత్రంలో మరో ఇద్దరు అగ్ర హీరోలు నటించనున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ లేటెస్ట్ విలన్ బాబీ దేవోల్, మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఎన్​బీకే 109లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవీంద్ర బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్ అనే క్యాప్షన్​తో రెండు వారాల క్రితం మూవీ మేకర్స్ ఈ కొత్త సినిమా పోస్టర్​ను కూడా ఆవిష్కరించారు. ప్రస్తుతం సినిమా నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి.

Last Updated : Dec 16, 2023, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.