ETV Bharat / entertainment

ఈ బుడ్డోడు ఇప్పుడు బిగ్​బాస్​ 6 కంటెస్టెంట్​.. ఎవరో గుర్తుపట్టగలరా? - బిగ్​బాస్​ 6 సింగర్ రేవంత్​

ఈ ఫొటోలో ఉన్న చిన్నోడు.. ప్రస్తుతం బిగ్​బాస్ 6వ సీజన్​లో కంటెస్టెంట్​గా తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతడికి మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్ కూడా ఉంది. అతడెవరో గుర్తుపట్టండి చూద్దాం..

Singer revanth childhood pic viral
సింగర్​ రేవంత్​ చిన్ననాటి ఫొటో వైరల్​
author img

By

Published : Sep 19, 2022, 8:29 PM IST

బుల్లితెరపై బిగ్​బాస్​ రియాల్టీ షోకు ఉండే ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తిచేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఆరో సీజన్​లో ఉంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హౌస్‌మేట్స్‌ అంతా తమదైన శైలిలో వినోదం పంచుతున్నారు.

అయితే ఈ సీజన్​ హౌస్​లోకి 21 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక మొదటివారం ఎలిమినేషన్ ప్రక్రియ లేదన్న బిగ్​బాస్​ రెండో వారం డబుల్ ఎలిమినేషన్‏తో ఒక్కసారిగా షాకిచ్చాడు. దీంతో గతవారం షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు మూడో వారం నడుస్తోంది. అయితే షో మొదటి నుంచి ఓ కుర్రాడు అందరి ఇంటిసభ్యులకు తన ఆట తీరుతో చుక్కలు చూపిస్తున్నాడు.

పైన ఫోటోను చూశారు కదా. అతడే ఇప్పుడు.. ప్రస్తుత సీజన్ 6లో కంటెస్టెంట్​గా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి రోజు నుంచి తన ఆట మొదలుపెట్టేశాడు. ఈ కుర్రాడికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. అలాగే కోపం తగ్గించుకో అంటూ నాగార్జునతో పాటు... కంటెస్టెంట్స్ సైతం అతడికి క్లాస్ తీసుకుంటున్నారు. ఇంతకీ అతడెవరో కాదండి.. సింగర్ రేవంత్. తెలుగు సినిమాల్లో ఎన్నో సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. యూత్‏లో రేవంత్‏కు ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుతో మెప్పిస్తున్నాడు.

ఇదీ చూడండి: ప్రైవేట్​ వీడియో లీక్​పై స్పందించిన నటి.. ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.